కావల్సినవి: బ్రెడ్‌స్లైసులు – ఆరు, వెన్న – పావుకప్పు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద – ముప్పావుకప్పు, పచ్చిమిర్చి – రెండు (సన్నగా తరగాలి), పాలకూర తరుగు – అరకప్పు, ఆమ్‌చూర్‌పొడి, కారం, చాట్‌మసాలా – అరచెంచా చొప్పున, గరంమసాలా – పావుచెంచా, ఉప్పు – తగినంత, నువ్వులు – పెద్ద చెంచా.
తయారీ: ఓ గిన్నెలో బంగాళాదుంప ముద్ద తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి తరుగు, పాలకూర తరుగు, ఆమ్‌చూర్‌పొడి, చాట్‌మసాలా, కారం, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. బ్రెడ్‌స్లైసులపై ఈ మిశ్రమాన్ని పరిచి, కొన్ని నువ్వుల్ని చల్లి, నొక్కినట్లు చేయాలి. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టి… కొద్దిగా వెన్న రాయాలి. దీనిపై రెండు బ్రెడ్‌స్లైసుల్ని ఉంచి, ఎర్రగా కాల్చాలి. ఇలా మిగిలినవీ చేసుకుంటే చాలు.