కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారికి జులైలో రికార్డులో స్థాయిలో ఆదాయం సమకూరింది. హుండీతో పాటు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా జులైలో రూ.106.28 కోట్ల ఆదాయం సమకూరినట్లు తితిదే వెల్లడించింది. ఈ ఏడాదిలో హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటడం ఇది మూడోసారి. మార్చిలో రూ.105.8 కోట్లు, జూన్లో రూ.100 కోట్ల మేర ఆదాయం లభించింది. ఈ ఏడాది చివరి నాటికి శ్రీవారి హుండీ ద్వారా రూ.1,234 కోట్ల ఆదాయం లభిస్తుందని తితిదే అంచనా వేస్తోంది.
తిరుమల హుండీకి భారీ ఆదాయం
Related tags :