భోగాపురంలో నిర్మంచబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం 1600కోట్ల ప్రాజెక్టని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ అన్నారు. శనివారం భోగాపురం విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వాసిత గ్రామమైన బొల్లెంకులపాలెం గ్రామంలో రైతులు, నిర్వాసితులుతో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకూ ఇచ్చిన భూములకు నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ పరిస్ధితులు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై కొంత మంది రైతులు మాట్లాడుతూ.. పూర్తి స్ధాయిలో నష్ట పరిహారం అందలేదని, డీ పట్టా భూములకు పెంచిన పరిహరం ఇవ్వలేదని, ఇళ్లపట్టాలు మాత్రమే ఇచ్చారని, ఆర్ అండ్ ఆర్ ఊసే లేదని రైతులు తెలిపారు. ప్లాట్లు వేసి లాటరీ తీసి ఇళ్లు ఇవ్వాలని అప్పుడే సమన్యాయం జరుగుతుందని బాధితులు తెలిపారు. స్ధానిక యువతకు ఉపాది కల్పిస్తామని గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అప్పలనాయుడు, విఆర్ఓ లు రామచంద్రరావు, గణపతి, రమణమ్మ, అట్టాడ రామునాయుడు, కార్యదర్శి విఫిన్ చంద్ర, రైతులు, నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ బడ్జెట్ ₹1600కోట్లు
Related tags :