*వ్యక్తిగత పూచీకత్తు వల్లే ఆత్మహత్యలు: జయదేవ్
వ్యాపారంలో నష్టపోవడానికి అనేక కారణాలుంటాయని అన్ని సంస్థలనూ ఒకేలా చూడకూడదని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. గురువారం లోక్సభలో నిరర్థక ఆస్తుల నియంత్రణ బిల్లుపై ఆయన మాట్లాడారు. దివాలాకు సంబంధించి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ బ్యాంకుల నిరర్థక ఆస్తుల చిట్టా పెరుగుదల ఆందోళనకరంగానే ఉందన్నారు. వ్యాపారంలో నష్టాలు ఎందుకొస్తున్నాయో కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.
*ఇదేనా పోలవరంపై మీ చిత్తశుద్ధి?
‘‘పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్నవాళ్లు, ఈ రోజు స్పిల్వేలో ఉండే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు మళ్లించారు. అవహేళనల్ని, ఆరోపణల్ని ఎదుర్కొంటూనే ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తి చేశాం. ఇంతా చేసినా మిగిలిన 30 శాతం పూర్తి చేయకపోతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది’’ అని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు గురువారం ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘వరద సమయంలో ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలకు వెనక్కు వెళ్లిపోమంటూ నోటీసులు ఇచ్చారంటే, ప్రాజెక్టు నిర్మాణం పట్ల మీకున్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్ధమవుతోంది. కృష్ణా నది ఎగువన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీళ్లు లేకపోయినా పట్టిసీమ పుణ్యమా అని గోదావరి వరదజలాలతో ప్రకాశం బ్యారేజ్ కళకళలాడుతోంది’’ అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
*అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలివ్వాలి: భట్టి విక్రమార్క
చింతమడకలో ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో అర్హతఉన్న ప్రతి కుటుంబానికీ అదేవిధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాస్తామని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డిలతో కలిసి భట్టివిక్రమార్క గురువారం విలేకరులతో మాట్లాడారు. సీఎం దృష్టిలో రాష్ట్ర ప్రజలందరూ సమానమేనని, ఒక చింతమడక గ్రామానికే సహాయం చేస్తే మిగతా వారికి అన్యాయం చేసిన వారవుతారన్నారు.
*లక్ష్మణ్వి ఊకదంపుడు ఉపన్యాసాలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊహల్లో కాలం గడుపుతున్నారని తెరాస శాసనసభ్యులు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్ విమర్శించారు. తెరాసను విమర్శించే హక్కు భాజపాకి ఏమాత్రం లేదని అన్నారు. గురువారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులను తెలంగాణకు తెప్పించడం చేతకాని భాజపా రాష్ట్ర నేతలకు మాట్లాడే హక్కే లేదు. సత్తా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్రం వద్ద పెండింగులో ఉన్న ప్రాజెక్టులను సాధించి మాట్లాడాలి’’ అని పేర్కొన్నారు.
*మండలిస్థానాలకు 26న ఉపఎన్నికలు
తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో మూడు, తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), కోలగట్ల వీరభద్రస్వామి ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. జూన్ 6న తమ మండలి సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఆ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి.
*అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలివ్వాలి: భట్టి విక్రమార్క
చింతమడకలో ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో అర్హతఉన్న ప్రతి కుటుంబానికీ అదేవిధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాస్తామని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డిలతో కలిసి భట్టివిక్రమార్క గురువారం విలేకరులతో మాట్లాడారు.
*తెరాస అవినీతిపై అధ్యయనం
తెరాస పాలనలో అవినీతిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి.. ఆధారాలతో ప్రజల ముందు దోషిగా నిలబెడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన బుధవారమిక్కడ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల్లో ఓటమిని జీర్ణించుకోలేక కేసీఆర్, కేటీఆర్లు భాజపాపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల్ని విస్మరించిందని లక్ష్మణ్ విమర్శించారు.
*ఇంటింటికీ వెళ్లి అమిత్షా సభ్యత్వం
కమల దళపతి అమిత్షా తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో భాజపా సభ్యత్వాల్ని భారీగా పెంచాలని ఇప్పటికే రాష్ట్ర పార్టీకి స్పష్టం చేసిన ఆయన స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. గుజరాత్లో సాధారణ సభ్యత్వం ఉండగా.. తెలంగాణ నుంచి పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సభ్యత్వం రావాలంటే ముందు 50 మందిని పార్టీలో చేర్పించాలి.
*జాతీయ రహదారులకు నిధులివ్వండి
తెలంగాణలో జాతీయ రహదారుల పనులకు అధిక నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్లతో కలిసి బుధవారం ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. హైదరాబాద్-విజయవాడ (ఎన్హెచ్-65) మార్గంలో సూర్యాపేట వద్ద సర్వీసు రోడ్లు, సెంట్రల్ లైటింగ్, అండర్ పాస్లు, మురుగు కాలువలు నిర్మించాలని కోరారు. తిరుమలగిరి-సూర్యాపేట (ఎన్హెచ్-365) రహదారిని నాగారం మండల కేంద్రంలో 4 వరుసలుగా విస్తరించాలని, డి.కొత్తపల్లి గ్రామం వద్ద కల్వర్టు, మురుగు కాలువలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
*ఇంటర్ బాధితుల కుటుంబాల్ని ఆదుకోండి: తెదేపా
ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలన్నింటినీ ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జగిత్యాలకు చెందిన ప్రశాంత్ కుటుంబానికి అఖిలపక్షం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని బుధవారం ఎన్టీఆర్ భవన్లో అందించారు. అఖిలపక్షంలో సీపీఐ, కాంగ్రెస్, తెజస, తెదేపా ఉన్నాయి. సభకు చాడ వెంకట్రెడ్డి, వినోద్రెడ్డి, విశ్వేశ్వరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి హాజరయ్యారు.
*నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతులొద్దు: తమ్మినేని
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అనుమతులను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య కళానిలయంలో వామపక్ష పార్టీలు, పర్యావరణ వేత్తలు, మేధావులతో కలిసి నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
*ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీశాం
శాసనసభ సమావేశాల్లో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే చర్చల కన్నా గత తెదేపా ప్రభుత్వంపై బురదచల్లేందుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందని…ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విలువైన సభా సమయాన్ని, సమావేశాల నిర్వహణకయ్యే ఖర్చుని అధికారపక్షం వృథా చేసిందని అన్నారు. వైకాపా సభ్యులు స్థాయి దిగజారి ప్రవర్తించారని ఆరోపించారు. వైకాపా ఇచ్చిన హామీలపై శాసనసభలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని తెదేపా నిలదీసిందని, ఇది మాట తప్పే ప్రభుత్వమని నిరూపించడంలో విజయం సాధించిందని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ మేరకు బుధవారం ట్విటర్లో వ్యాఖ్యానించారు.
*కాపులకు రిజర్వేషన్ తిరస్కరణ సరికాదు: కన్నా
రాజ్యసభలో ముమ్మారు తలాక్ బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని, దేశంలోని ముస్లిం మహిళలు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అప్పటి సీఎం చంద్రబాబు జీవో ఇచ్చారని, ఇప్పుడు ఆ జీవో చెల్లదని రాష్ట్ర ప్రభుత్వం అనటం సరికాదన్నారు. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకున్న జీవో, 5 శాతం రిజర్వేషన్ తిరస్కరణ మంచిది కాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలన్నారు.
*వాన్పిక్లో వాస్తవాలు వెల్లడించాలి: యనమల
వాన్పిక్ కేసు విషయంలో సెర్బియాలో అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్ను తప్పించేందుకు వైకాపా ఎంపీలు వినతులు సమర్పించడం హేయమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వానికి నిందితుల సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని బుధవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. వాన్పిక్ కుంభకోణంలో సీబీఐ కేసు తేలకుండానే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఎలా విడుదల చేస్తారు? అని ప్రశ్నించారు.
తెరాస అవినీతిపై అధ్యయనం-రాజకీయం-08/03
Related tags :