ఈ కాలంలో 70-80 సంవత్సరాలకే జీవితకాలం ముగుస్తున్నది. 60 యేండ్లు వస్తే.. ఎవరో ఒకరి తోడు కావాలి. అలాంటిది న్యూయార్క్‌కి చెందిన లూయిస్ సిగ్నోర్ అనే ఈ బామ్మ వందేండ్లు నిండినా.. హాయిగా తన పనులు తాను చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నది. ఈ శతాధిక వృద్ధురాలు ఇటివలే తన 107వ పుట్టిన రోజు జరుపుకున్నది. దీంతో ఆమె ఆరోగ్య రహస్యమేంటి? ఇంతకాలం జీవించగలగడానికి కారణాలేంటోనని ఆమెను అడుగుతున్నారట. న్యూయార్క్‌లోని కూప్ సిటీలో జాసా బార్టో సీనియర్ సెంటర్‌లో లూయిస్ 107వ పుట్టినరోజు వేడుకలను ఆమె బంధువులు ఘనంగా జరిపారు. ఆమె ఆరోగ్య రహస్యమేంటి? అన్నది చాలామందికి కలిగిన ప్రశ్న. అయితే ఈ బామ్మ పెళ్లి చేసుకోలేదు. అదే తన ఆరోగ్య రహస్యం కావచ్చని ఆమె చెబుతున్నది. రోజువారీ పనులు చేసుకుంటూనే.. ఆరోగ్యకరమైన ఆహారం తినడం తన దీర్ఘాయుష్షుకి మరో కారణమట. ఇప్పటికి కూడా చేతనైనన్ని ఎక్సర్‌సైజ్‌లు, డ్యాన్స్‌లు చేస్తుంది లూయిస్. లంచ్ తర్వాత ఆమె బింగో ఆడుతుంది. బీపీ ఉన్నా.. కంట్రోల్‌లో ఉండేందుకు మందులు వాడుతున్నది. అంత మాత్రాన ఆమె ఎప్పుడు దిగులు చెందలేదు. రోజూ హుషారుగానే ఉంటుంది.
107ఏళ్ల బామ్మగారి ఆరోగ్య రహస్యం…పెళ్లి చేసుకోకపోవడం
Related tags :