ScienceAndTech

పేర్లు మారిపోనున్నాయి

Instagram and WhatsApp To Get Name Change

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌, ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి మాతృక సంస్థ అయిన ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్ నుంచి వచ్చినప్పటికీ వీటికంటూ స్వతంత్రత ఉంది. గత ఏడాది కాలంగా ఫేస్‌బుక్‌ వీటికి ఆ స్వతంత్రతను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా వాటి పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ 2012లో ప్రారంభించగా, వాట్సప్‌ 2014లో వినియోగంలోకి వచ్చింది. ఈ రెండింటికీ సొంత మేనేజర్లు, ఉద్యోగులు, విడివిడి కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఫేస్‌బుక్‌ తమ సంస్థలో కొన్ని కొత్త సంస్కరణలు తెచ్చింది. వాటిలో భాగంగా వీటికి స్వతంత్రతను తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేర్లలో కాస్త మార్పులు చేయనున్నట్లు ఈ వారం ప్రకటించింది. ఇకపై వాట్సప్‌ పేరును ‘వాట్సప్‌ ఫ్రమ్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను ‘ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రమ్‌ ఫేస్‌బుక్‌’ అని మార్చనుంది. ఇక గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో ఈ పేర్లతోనే ఈ రెండు యాప్‌లు కనిపిస్తాయి. లాగిన్‌ పేజీల్లోనూ ఇదే పేరు కనపడనుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సప్‌ను మూడింటినీ ఇక మాతృక సంస్థే నిర్వహిస్తుంది. గత ఐదేళ్లకాలంలో వాట్సప్‌, ఇన్‌స్టాలలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. వినియోగదారులకు సౌలభ్యం కోసం, వారిని ఆకర్షించేందుకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌, ఫేస్‌బుక్‌ స్టోరీస్‌, వాట్సప్‌ స్టేటస్‌ వంటి ఫీచర్లు ఈ కోవలోకి చెందినవే