Politics

ఆందోళన పడకండి. అంతా నార్మల్.

ఆందోళన పడకండి. అంతా నార్మల్.-Kishan Reddy Says All Is Normal In Jammu & Kashmir

జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై  ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూ నుంచి విద్యార్థులు, పర్యాటకులు సురక్షితంగా స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ,స్థానిక ప్రభుత్వం  అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. రాత్రి జమ్మూ నుంచి  బయలుదేరిన 20 మంది నిట్ తెలుగు విద్యార్థులు  మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకొంటారన్నారు..మిగిలిన 90 విద్యార్థులు ఈ ఉదయం స్పెషల్ ట్రైన్ లో జమ్ము నుంచి ఢిల్లీకి బయలుదేరారని మంత్రి తెలిపారు. అమరనాధ్ యాత్రకు  తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్నసూచన మేరకే  జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జమ్ము కశ్మీర్ లో ఉన్న తెలుగువారు కానీ మరెవరి భద్రతకు ఢోకా లేదని కిషన్ రెడ్డి అన్నారు.