DailyDose

హైదరాబాద్లోని అమెరికన్ కాన్సుల్ జనరల్‌గా రీఫ్మాన్ నియామకం-తాజావార్తలు–08/04

Reefman Appointed As Hyderabad American Consulate General

*ప్రస్తుతం బంగ్లాదేశ్లోని అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా ఉన్న జోయెల్ రీఫ్మాన్ హైదరాబాద్లో అమెరికన్ కాన్సుల్ జనరల్గా నియమితులయ్యారు. ఆయన త్వరలోనే హైదరాబాద్కు చేరుకొని నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన కేథరీనా హడ్డా మూడేళ్ల పదవీకాలం పూర్తికావడంతో తిరిగి అమెరికా వెళ్లిపోయారు.
*ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. గత ఐదేళ్లుగా నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
*త్వరలోనే మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదిస్తామని హోంమంత్రి సుచరిత చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నామని, వరద ముంపు గ్రామాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. సహాయక చర్యలు లేవని, టీడీపీ అధినేత చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని, మొన్నటి వరకు రాజకీయ దాడులు అన్నారు… ఇప్పుడు సంక్షేమం కుంటుపడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తామన్నచంద్రబాబు.. రెండు నెలలకే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లు మూసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుచరిత ఆరోపించారు.
*అన్ని రాష్ట్రా ల్లో అధికారంలోకి రావాలన్న బీజేపీ లక్ష్యానికి అనుగుణంగా ఎంపీలు పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ అభ్యాస వర్గ పేరుతో ప్రారంభమైన ఎంపీల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. 380 మంది పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఎంపీలు తమ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకునేందుకు సమర్థవంతంగా కృషి చేయాలని సూచిం చారు. ఎంపీలు తమ ప్రాంత సమస్యలను పట్టించుకుంటేనే మళ్లీ ఎన్నికయ్యే వీలుంటుందని అభి ప్రాయపడ్డారు.
*జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి, ఎల్‌ఓసీ వెంబడి నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంటులోని తన కార్యాలయంలో సమీక్షిస్తున్నారు. అమిత్‌షా అధ్యక్షతన జరుగుతున్న ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గవుబ పాల్గొన్నారు. ఇటీవల దోవల్ జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాతే హోం శాఖ అదనపు కేంద్ర బలాలను రాష్ట్రానికి పంపింది. అనంతరం ఉగ్రదాడులకు అవకాశాలున్నాయంటూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తూ కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిని అమిత్‌షా ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
*రాష్ట్ర ప్రభుత్వం నయీం డైరీని బయటపెట్టాలని, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
*ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ గ్రామీణ మండలం బంగారుగూడ ఆదర్శ పాఠశాల విద్యార్థులు శనివారం వాగు ఉప్పొంగడంతో ఇళ్లకు వెళ్లలేదు. పాఠశాల సమీపంలోని వాగు వంతెనపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
*రాష్ట్రంలో డిగ్రీలో నిండిన సీట్ల కంటే మిగిలిపోయిన సీట్లే అధికంగా ఉన్నాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) ద్వారా 980 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించగా కేవలం 45 శాతం సీట్లే భర్తీ అయ్యాయి.
*వచ్చే విద్యా సంవత్సరం(2020-21)లో ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతను దిల్లీ ఐఐటీ చేపట్టనుంది. ఈ మేరకు జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఈబీ) నిర్ణయించింది.
*విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇస్తున్నామంటూనే జోన్ పరిధిలోని వాల్తేరు డివిజన్ను తొలగించే ప్రతిపాదన చేయడం దురదృష్టకరమని దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
*ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద రైతులకు వందశాతం రాయితీపై విత్తనాలు అందిస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్కుమార్ తెలిపారు. సోమ, మంగళవారాల నుంచి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
*ఏపీ నిట్కు విదేశీ విద్యార్థులు తరలివస్తున్నారు. వారి కోసం ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్థలోని 486 సీట్లకు అదనంగా మరో 50 సీట్లను కేటాయించారు. ఇందులో భాగంగా ఉగాండ, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఇథియోపియా దేశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
*వచ్చే విద్యా సంవత్సరం(2020-21)లో ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతను దిల్లీ ఐఐటీ చేపట్టనుంది. ఈ మేరకు జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఈబీ) నిర్ణయించింది.