సిలికానాంధ్ర సంస్థ స్థాపించి 18ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మిల్పిటాస్‌లోని జైన్ మందిరంలో సంస్థాపక దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీగేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పేరడీ కవితా గానం అలరించింది. అనంతరం కస్తూరి ఫణిమాధవ్ ఆధ్వర్యంలో మాట్లాడే బొమ్మ మిమిక్రీ ప్రదర్శన జరిగింది. సిలికానాంధ్ర వ్యవస్థాపక ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ గత 18ఏళ్లలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు సహకరించిన మిత్రులు, దాతలు, శ్రేయొభిలాషులు, స్వచ్ఛంద కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ దాత డా.లకిరెడ్డి హనిమిరెడ్డి ఆధ్వర్యంలో జొన్నవిత్తులను ఘనంగా సత్కరించారు. మనబడి కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ అమెరికాతో పాటు పొరుగునే ఉన్న కెనడా దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మనబడికి విశేష్ ఆదరణ లభిస్తోందని, ఆగష్టు 31వ తేదీ లోపుగా మనబడిలో విద్యార్థులను జేర్పించవల్సిందిగా కోరారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన వయోలిన్ విద్వాంసుడు అశోక్ గుర్జాలే ఆధ్వర్యంలో 18మంది ప్రవాస చిన్నారులు ప్రదర్శించిన వాయులీన నాదామృతవర్షిణి ఆహుతులను ఆకట్టుకుంది. కొండిపర్తి దిలీప్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన హాస్య గల్పిక నవ్వులు పూయించింది. ఈ కార్యక్రమంలో తాటిపాముల మృత్యుంజయుడు, కొండుభట్ల దీనబాబు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సిలికానాంధ్ర 18వ సంస్థాపక దినోత్సవం
Related tags :