DailyDose

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద-తాజావార్తలు–08/05

Heavy Floods At Srisailam Dam-Today Telugu Breaking News-Aug52019-శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద-తాజావార్తలు–08/05

* శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న వరద ఉదృతి ఇన్ ఫ్లో- 2,46,758. క్యూసెక్కులు అవుట్ ఫ్లో -22,883.ప్రస్తుత నీటి మట్టం : 862.50 అడుగులుపూర్తి స్థాయి నీటిమట్టం : 885అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ : 215 టిఎంసిలుప్రస్తుత నీటి నిల్వ : 113.9824. టిఎంసిలు.
* గోదావరి వరదలు, ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తన నివాసంలో సమీక్షించారు. ముంపు బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ విషయలో ఆలస్యం చేయవద్దని అధికారులకు మరోసారి స్పష్టంచేశారు. విదేశీ పర్యటనను ముగించుకున్న తర్వాత సీఎం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న తర్వాత గోదావరి వరదలు, ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు.
* ఈ నెల 8న కియా కొత్త కారు ‘సెల్తోస్‌’ విడుదల
ఈ నెల 8న మధ్యాహ్నం కియా కంపెనీ తన కొత్తకారు ‘సెల్తోస్‌’ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిని కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నివాసంలో కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేవ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ ముఖ్యమంత్రిని కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఉత్పత్తిచేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజిన్లనుకూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్తకారు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరవుతున్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తయిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పోస్టుమార్టం నివేదిక సమర్పించడానికి కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఈ నెల న లింగన్న పోస్టుమార్టం రిపోర్ట్‌ను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
* రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అప్పుల బాధతో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే నలుగురు రైతులు ఆత్మహత్య పాలవగా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
* ముంబై నగరాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానలతో మితి నది ప్ర మాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో క్రాంతినగర్‌ నుంచి 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించింది. అరేబియా మహాసముద్రంలో భారీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమకు మరిన్ని విపత్తు సహాయక బృందాలు కావాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది.
* మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నా యి. నదులు, వాగులు పొంగుతుండడంతో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. నాసిక్‌ పట్టణాన్ని వరద ముంచెత్తింది. త్రయంబకేశ్వర ఆలయ ఆవరణలోకి వరదనీరు ప్రవేశించింది. గంగపూర్‌ డ్యాంలోకి భారీగా వరదనీరు చేరడం తో ఆదివారం 17,748 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. గౌతమి, అలంది, భవాలి, వాల్దేవి వంటి నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నాసిక్‌ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
* పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది.దక్షిణ గుజరాత్‌ నుంచి మధ్యభారతం మీదుగా ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 36 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, తరువాత ఇది మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దీంతో కోస్తాలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
* జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని సునిశిత ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధించారు.
*జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండల కేంద్రంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఎంఈవో ముత్తయ్య.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్దికుంట కృష్ణారెడ్డి వద్ద రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఎంఈవోను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎంఈవోను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
* జమ్మూకశ్మీర్లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. శ్రీనగర్లో ఆదివారం అర్ధరాత్రి(తెల్లవారితే సోమవారం) నుంచి 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.
*కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సంసిద్ధమయ్యాయి. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. మరోవైపు కశ్మీర్లో ఉద్రిక్త, ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
*కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆలమట్టి నుంచి దిగువకు 2.85 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. దాదాపు అంతే మొత్తంలో నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు విడుదలవుతోంది.
*నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి అబుదాబి ‘డీహెచ్15 మిలియన్ బిగ్ టికెట్ రఫెల్ లాటరీ’ డ్రాలో రూ.28 కోట్ల భారీ మొత్తం వచ్చింది. జక్రాన్పల్లికి చెందిన రైతు రిక్కల విలాస్రెడ్డి కొన్నేళ్లుగా దుబాయి, అబుదాబిలో ట్రక్కు డ్రైవర్గా పని చేస్తున్నారు.
*ఇప్పటికే రాష్ట్రంలో పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ చికిత్సలను, ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్ఎస్) కింద చికిత్సలను అరకొరగా అందిస్తుండగా.. ఆ కొద్దిపాటి పరిమిత చికిత్సలకు కూడా ఇక నుంచి ఆటంకం ఏర్పడనుంది.
*రాష్ట్రంలో 416 ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో జాప్యంపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మూడో విడత ప్రవేశాలకు గత నెలాఖరులోనే ప్రకటన జారీ చేయాలని తొలుత నిర్ణయించినా వాయిదా పడింది.
*మనోధైర్యంతో క్యాన్సర్ను జయించవచ్చని అపోలో ఆసుపత్రుల సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి తెలిపారు. మారుతున్న జీవనశైలి కారణంగా దేశవ్యాప్తంగా ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోందని చెప్పారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ విజయ ఆనంద్రెడ్డి రచించిన ‘నేను క్యాన్సర్ను జయించాను’ పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్లో జరిగింది.
*మనిషిని చైతన్యవంతం చేసే యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పించేలా..తెలంగాణలో ప్రత్యేక విశ్వవిద్యాలయానికి కృషిచేస్తామని రాష్ట్ర మాజీ మంత్రి- సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు ప్రకటించారు.
*రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. సోమ లేదా మంగళవారం బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు.
*ముంబయి రైల్వే డివిజన్లో కురుస్తున్న వర్షాలతో 3, 4 తేదీల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ మార్గంలో 4వ తేదీన బయల్దేరిన రైళ్లలో 5 రైళ్లు పూర్తిగా, 10 పాక్షికంగా రద్దయ్యాయి.
*వైద్య విద్య కౌన్సెలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కాళోజీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో అక్రమాలు చోటుచేసుకోవడంతో రెండువిడతల్లో 262 సీట్లను ఆయా వర్గాల విద్యార్థులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
*బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ నెల 7న నిర్వహించనున్న జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
*వరద బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
*దేశంలో మహిళలపై అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడుల్ని నిరసిస్తూ ఈ నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. ఆరెస్సెస్, భాజపా అనుబంధ సంస్థల హింస దేశంలో నానాటికీ పెరిగిపోతోందని ఆదివారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.