* స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. కశ్మీర్ లో టెన్షన్ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ నష్టాలతోనే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. HDFC , TCS, NTPC, HCL టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లలో కొనసాగుతున్నాయి. ICICI, యాక్సిస్ బ్యాంకు, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్ కార్స్, DHLF, LIC హౌసింగ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70 రూపాయల 46 పైసలు ఉంది.
*వచ్చే అయిదేళ్ల పాటు వరుసగా 9% వృద్ధితో సాగితేనే, ప్రధాని మోదీ కలలు కంటున్న 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.350 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ఈవై తాజా నివేదిక వెల్లడించింది.
*వాహన రంగం కొన్ని త్రైమాసికాలుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, గత 3 నెలల్లో దేశంలో 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) వెల్లడించింది.
* కొనుగోలుదార్ల ఇంటి వద్దే బైక్/స్కూటర్ అందించేందుకు హీరో మోటోకార్ప్ సన్నద్ధమవుతోంది. ఇందుకు రూ.349 మేర అదనంగా వసూలు చేయనుంది.
*గుజరాత్(వడోదర)లో రెండు క్లినికల్ ఫార్మకాలజీ ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు సన్ఫార్మా వెల్లడించింది.
*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా తొమ్మిది బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధించింది.
*ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి కార్పొరేషన్ బ్యాంక్ రూ.103.28 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.84.96 కోట్లతో పోలిస్తే లాభం 22 శాతం వృద్ధి చెందింది.
* 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖ ఓడరేవు సరకు రవాణాలో మూడో స్థానంలో నిలిచిందని పోర్టు వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నాలుగో స్థానంలో ఉంది.
*దేశీయ కార్ల విపణిలోకి కొత్తగా అడుగుపెట్టిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజమైన కియా మోటార్స్ శనివారం నాడు ఒకేరోజు హైదరాబాద్లో మూడు నూతన షోరూమ్లను ప్రారంభించింది.
కాశ్మీర్‌లో టెన్షన్-నష్టాల్లో స్టాక్ మార్కెట్-వాణిజ్య-08/05
Related tags :