కత్రినాకైఫ్…బాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది. ఏళ్ల తరబడి నటిస్తున్నా ఇప్పటికీ ఆమె హవా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యే ఆమె సల్మాన్ఖాన్తో కలిసి నటించిన ‘భారత్’ మంచి విజయం సాధించింది. ఇప్పుడు కత్రినా నిర్మాతగా కొత్త బాధ్యతను మోయడానికి సిద్ధమవుతోంది. ‘‘అవును గొప్ప సృజనాత్మక కథల్ని తెరపైకి తీసుకురావడం గురించి ఎప్పుడెప్పుడు నిర్మాతని అవుదామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటోంది కత్రిన. ‘‘కొత్త కథతో తీస్తున్నాం అనే మాట ఈ మధ్య చిత్ర పరిశ్రమలో సర్వసాధారణమైపోయింది. కానీ సరికొత్త కథతోనే నా నుంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. పక్కా స్క్రిప్టుతో ఓ సినిమా సెట్స్పైకి వస్తుందంటే ఆ సినిమాకి తిరుగుండదు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నటిగా కూడా అలాంటి బౌండెడ్ స్క్రిప్టు కోసమే నేను చూస్తాను. వినూత్నమైన ఆలోచనలతో చాలామంది దర్శకులొస్తున్నారు. అన్ని కథలకు వెండితెరపై అవకాశం దక్కకపోవచ్చు. అలాంటి వాటికి డిజిటల్ మీడియా ఓ వరమనే చెప్పాలి. డిజిటల్ మీడియా ద్వారా ఎంతోమందికి తమ ప్రతిభను చాటుకునే అవకాశం దక్కుతుంది.’’అని చెప్పింది కత్రినా.
నిర్మాత:కైఫ్
Related tags :