తెరపివ్వని వర్షాల్లో, బాగా ముసురు పట్టినప్పుడు చలిచలిగా ఉంటుంది. చలిగా ఉన్న వాతావరణంలో కొన్ని పదార్థాలు తీసుకుంటే ఒంటికి వేడినిస్తాయి. అవేంటో చూద్దాం.దానిమ్మలో చాలా పోషకాలుంటాయి. రక్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని మరింత వృద్ధి చేస్తుంది. అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది. హృద్రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. చిలకడ దుంపలు చక్కటి పోషకాహారం. శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. వీటిలో పీచు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ‘ఎ’, ‘సి’ ఖనిజ లవణాలు, మాంగనీసు, రాగి అధికంగా లభిస్తాయి. వీటిని ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని, తరచూ తీసుకుంటే ఈ కాలంలో ఎదురయ్యే అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు. పాలకూర ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఇనుము, క్యాల్షియం సమృద్ధిగా దొరుకుతాయి. ప్రతిరోజూ పాలకూరను ఉడికించిగానీ లేదంటే సూపు, రసం రూపంలో తీసుకొనే అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే వేడిని అందిస్తాయి. నువ్వులతో తయారుచేసిన పదార్థాలను భోజనం తర్వాత తీసుకుంటే అరుగుదల బాగుంటుంది.
వర్షాకాలం బెస్ట్ ఆహారం…దానిమ్మ
Related tags :