టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున గుర్కొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ త్వరలో సాహో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ప్రభాస్ సినిమాలు ఏ స్థాయిలో వార్తల్లో ఉంటాయో, ప్రభాస్ పెళ్లి వార్తలు కూడా అదే స్థాయిలో వార్తల్లో వినిపిస్తుంటాయి.తాజాగా సాహో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సాహో సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ప్రభాస్ గాని ఆయన పీఆర్ టీం గాని ఇంతవరకు స్పందించలేదు.
అమెరికా అమ్మాయితో ప్రభాస్ పెళ్లి
Related tags :