‘‘చిత్రసీమలో అనుభవం, అవకాశం… రెండూ గొప్పవే. వచ్చిన అవకాశాలే మనల్ని రాటు తేలేలా చేస్తుంటాయి’’ అంటోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ‘వాల్మీకి’లో కథానాయికగా నటిస్తోంది. వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. పూజా మాట్లాడుతూ ‘‘ఎవరి ప్రతిభ ఏంటన్నది తేలాలంటే ముందు అవకాశాలు రావాలి. నాలో ఎంత గొప్ప నటి అయినా ఉండొచ్చు. తను బయటకు రాకపోతే… నాలో ఓ నటి ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? ఏ సినిమా బాగా ఆడుతుందో, ఏది ఆడదో లెక్క కట్టడం చాలా కష్టం. ఆ సినిమా వల్ల నేనేం నేర్చుకుంటాను? ఆ సినిమా చేస్తున్నప్పుడు, ఆ పాత్రతో ప్రయాణం చేస్తున్నప్పుడు నేనెంత ఆనందంగా ఉంటాను? అనేదే ఆలోచిస్తా. ఇక విజయం అంటారా? అది ఎప్పుడూ బోనస్గానే భావించాలి. అటు విజయం దక్కక, ఇటు పని చేసినందుకు సంతృప్తి లేకపోతే అలాంటి పాత్రలు చేయడంలో అర్థం ఉండదు’’ అంది.
అనుభవం-అవకాశం అదరహో
Related tags :