DailyDose

కాశ్మీర్ సమస్యపై TNI ప్రత్యేక కథనాలు

Special Stories On Kashmi Issue-Today Kashmir News-Aug52019-కాశ్మీర్ సమస్యపై TNI ప్రత్యేక కథనాలు

* జమ్ము కశ్మీర్‌‌ను విభజించిన కేంద్రం.. కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో పలు కీలక ప్రకటనలు చేశారు. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌ను విభజించగా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము,కశ్మీర్‌లను విభజించారు. ఈ నిర్ణయంతో కశ్మర్‌ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తి ఇక కశ్మీర్‌కు ఉండదు
*కశ్మీర్‌పై ఉభయసభల్లో కీలక ప్రకటన చేయనున్న అమిత్‌షా
కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. మోదీ సారథ్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ డోవల్, మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఎంపీలు నేరుగా పార్లమెంటు వెళ్లారు.కాగా, కశ్మీర్ పరిస్థితిపై హోం మంత్రి అమిత్‌షా ఉభయసభల్లోనూ ఇవాళ ప్రకటన చేయనున్నారు. తొలుత మధ్యాహ్నం 11 గంటలకు రాజ్యసభలోనూ, ఆ తర్వాత 12 గంటలకు లోక్‌సభలోనూ ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూసీ) 10 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు.
*మోదీ, అమిత్‌షాకు హ్యాట్సాఫ్: ఎంపీ విజయసాయి
జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్‌షాకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు రాజ్యసభలో విజయసాయి వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయని ఆయన చెప్పారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తమ పార్టీ మద్దతుజగన్మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు ఎందుకు ఉండాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి రెండు జాతీయ పతాకాలు ఎందుకు ఉండాలని నిలదీశారు. కశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక పాకిస్థానీ భారత పౌరుడు ఎలా అవుతాడని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
*జమ్మూకశ్మీర్ ఇక నుంచి కేంద్రపాలిత ప్రాంతం
జమ్మూ కశ్మీరుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హిమాలయ పర్వత సానువుల్లోని కీలక రాష్ట్రాన్ని మూడు భాగాలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జమ్మూ, కశ్మీర్‌, లద్ధాఖ్‌‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ,కశ్మీర్ ఏర్పడనున్నాయి. చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్ధాఖ్‌‌ ఏర్పడనుంది. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370, 35ఏ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో.. టిబెట్‌, చైనా, గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ సరిహద్దులుగా కలిగిన లద్ధాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతమైంది.
*అమిత్ షా ప్రకటన చేసిన క్షణాల్లోనే ఆర్టికల్ 370 రద్దు
రాజ్యసభలో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కానుంది.
*కశ్మీర్‌పై ఉభయసభల్లో కీలక ప్రకటన చేయనున్న అమిత్‌షా
కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. మోదీ సారథ్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ డోవల్, మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఎంపీలు నేరుగా పార్లమెంటు వెళ్లారు.కాగా, కశ్మీర్ పరిస్థితిపై హోం మంత్రి అమిత్‌షా ఉభయసభల్లోనూ ఇవాళ ప్రకటన చేయనున్నారు. తొలుత మధ్యాహ్నం 11 గంటలకు రాజ్యసభలోనూ, ఆ తర్వాత 12 గంటలకు లోక్‌సభలోనూ ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూసీ) 10 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు.
* భారత చరిత్రలో చీకటి దినం-మెహబూబా ముఫ్తీ మండిపాటు
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.‘భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు అత్యంత చీకటి దినం. 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారు. భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం’ అని ట్వీట్‌ చేశారు.మరో ట్వీట్‌లో ‘భారత ప్రభుత్వం ఉద్దేశమేంటో ఇప్పుడు తేలిపోయింది. ప్రజలను భయపెట్టి కశ్మీర్‌ను లాక్కోవాలని చూస్తున్నారు. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భారత్‌ విఫలమయింది. కశ్మీర్‌ను ఆక్రమించిన దేశంగా భారత్‌ మిగిలిపోతుంది’ అని పేర్కొన్నారు.
*మోదీ, అమిత్‌షాకు హ్యాట్సాఫ్: ఎంపీ విజయసాయి
జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్‌షాకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు రాజ్యసభలో విజయసాయి వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయని ఆయన చెప్పారు.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తమ పార్టీ మద్దతు, జగన్మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు ఎందుకు ఉండాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి రెండు జాతీయ పతాకాలు ఎందుకు ఉండాలని నిలదీశారు. కశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక పాకిస్థానీ భారత పౌరుడు ఎలా అవుతాడని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
* రెండుగా జమ్మూ కశ్మీర్ విభజన: కేంద్రం బిల్లు
370, 35A ఆర్టికల్ రద్దు చేయడానికి ప్రతిపాదించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. రాజ్యసభలో మాట్లాడిన ఆయన జమ్ము కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయనున్నట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్ ను లడక్, జమ్ము కశ్మీర్ లు గా విభజించనున్నట్టు చెప్పారు. అయితే జమ్ము కశ్మీర్ కు అసెంబ్లీ ఉంటదని, లడక్ లో అసెంబ్లీ ఉండదని తెలిపారు.ఆర్టికల్ 370, 35Aని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అమిత్ షా ప్రతిపాదనతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మరో గంటలో లోక్ సభలో మాట్లాడనున్నారు అమిత్ షా.
* 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు..
జూన్‌ 2, 2014కి ముందు 28గా ఉన్న రాష్ట్రాల సంఖ్య తెలంగాణ ఏర్పాటుతో 29కి చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య మళ్లీ 28కి చేరింది. జమ్ముకశ్మీర్‌ను విభజిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రాల సంఖ్య తగ్గి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈరోజు రాజ్యసభలో ప్రకటించారు. జమ్ము-కశ్మీర్‌ చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లద్దాఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు కానున్నాయి. రెండు ప్రాంతాలకు ప్రత్యేక లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉండనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28కి చేరగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదికి చేరింది.ఇప్పటివరకు కశ్మీర్‌లో 22 జిల్లాలు ఉండేవి. వాటిని జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌ రీజియన్లుగా వ్యవహరించేవారు. కాగా, జమ్ములో 10 జిల్లాలు, కశ్మీర్‌లో 10, లద్దాఖ్‌లో రెండు జిల్లాలు ఉండేవి. తాజా కేంద్రం నిర్ణయంతో లెహ్‌, కార్గిల్‌ జిల్లాలతో కూడిన లద్దాఖ్‌ రీజియన్‌ చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. పది జిల్లాలతో కూడిన కశ్మీర్‌ను మరో పది జిల్లాలతో కూడిన జమ్ముతో కలిపి చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేశారు.జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లును ఈరోజు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రేపు లోక్‌సభ ఆమోదానికి రానుంది. అలాగే వీటితో పాటు అధికరణ 370ని కేంద్ర రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
* కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: తెదేపా
జమ్మూకశ్మీర్‌ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెదేపా స్పష్టం చేసింది. ఈ మేరకు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా జీవించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమానహక్కులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఆరు దశాబ్దాలుగా కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్‌ విభజనకు సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రవీంద్రకుమార్‌ అభినందనలు తెలిపారు. ఈ అంశంలో కేంద్రానికి తెదేపా మద్దతిస్తుందని చెప్పారు.