Fashion

టర్కిష్ మహిళల సౌందర్య రహస్యం….ఆవిరి స్నానం

The secret of turkish beauty is steam bath-టర్కిష్ మహిళల సౌందర్య రహస్యం....ఆవిరి స్నానం

టర్కిష్‌ మహిళలు చాలా అందంగా ఉంటారట. జన్యుపరంగా వచ్చే అందం కాకుండా… తరతరాలుగా వాళ్లు పాటిస్తోన్న కొన్ని సౌందర్య చిట్కాలే అందుకు కారణం. అవేంటో మనమూ చూసేద్దామా…టర్కిష్‌ మహిళలు క్రమం తప్పకుండా గులాబీ నీటిని తమ సౌందర్య సంరక్షణలో వాడుతుంటారు. ఇవి చర్మాన్ని పొడిబారకుండా తాజాగా ఉంచుతాయి. గులాబీరేకల్ని నీటిలో వేసి మరిగించి చల్లారాక ఆ నీటిని ముఖానికి రాసుకుంటారు. స్నానం చేసిన తరువాతా వాడతారు. వీరు హమ్మామ్స్‌కి ప్రాధాన్యం ఇస్తారు. ఇదో రకమైన ఆవిరిస్నానం. శతాబ్దాలుగా ఇది ప్రాచుర్యంలో ఉంది. దీనివల్ల వారి చర్మం మృదువుగా తయారవడమే కాదు…చర్మగ్రంథులు తెరుచుకుని మురికి బయటకు వస్తుంది. వీరు ప్రత్యేకమైన బ్లాక్‌ సోప్‌నీ వాడతారు. దీనిలోని సుగుణాలు చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి శుభ్రపరుస్తాయి. స్క్రబ్‌లానూ పనిచేసి మృతకణాల్ని తొలగిస్తాయి. మొరాకోలోని అట్లాస్‌ పర్వత శ్రేణుల్లో దొరికే ప్రత్యేకమైన క్లేతో ఆ సబ్బు తయారు చేస్తారు. ఇవి మాత్రమే కాదు… వీరు పెరుగునీ ఎక్కువగా తీసుకుంటారు. దీనిలో ఉండే ప్రొబయోటిక్స్‌, ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా తీర్చిదిద్దుతాయి.