ప్రముఖ సంగీత ఆచార్యుడు కె.రామాచారిని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) సభ్యులు ఘనంగా సత్కరించారు. ‘లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ’ ద్వారా ప్రవాస చిన్నారులకు ఆయన 20ఏళ్లుగా సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలకు గుర్తింపుగా TPAD ఈ సత్కారాన్ని అందజేసింది. అజయ్ రెడ్డి, పవన్ గంగాధర, చంద్ర పోలీస్, రఘువీర్ బండారు, శారద సింగిరెడ్డి, మాధవి సుంకి రెడ్డి, సుధాకర్ కలసాని, రవికాంత్ మామిడి, శ్రీనివాస్ వేముల.. కోమండూరి రామాచారిని సత్కరించారు. టీపీఏడీ సంస్థ సభ్యులు శ్రీనివాస్ వేముల, బుచ్చి రెడ్డి గోలి, అనురాధ మేకల, వేణు భాగ్యనగర్, జయ తెలకలపల్లి, ఇందు పంచేరుపుల, నరేష్ సుంకి రెడ్డి, రోజా ఆడెపు, మధుమతి వైశ్యారాజు, రూప కన్నయ్యగారిరి, శ్రీనివాస్ తుల, టీపీఏడీ చైర్మన్ జానకిరామ్ మందాడి, రావ్ కల్వాలా తదితరులు పాల్గొన్నారు.
రామాచారికి TPAD సన్మానం
Related tags :