Fashion

ఆ దుస్తులు మార్చుకోకపోతే వ్యాధులు సంక్రమిస్తాయి

Change your clothes post workout or wait for diseases

కొందరు వ్యాయామం పూర్తవడం ఆలస్యం… హడావుడిగా ఇతర పనుల్లో నిమగ్నమవుతారు. అలా చేయడం సరికాదంటారు ఫిట్‌నెస్‌ నిపుణులు.
* వ్యాయామం చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట రూపంలో ఎక్కువ మొత్తంలో నీరు బయటకు వెళ్తుంది. శరీరం మళ్లీ మామూలు స్థితికి రావాలంటే… వ్యాయామం తరువాత దాహం తీరేలా నీళ్లు తాగాలి. అప్పుడే డీహైడ్రేషన్‌ సమస్య ఎదురుకాదు.
* తీవ్రంగా కసరత్తు చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం, జీవక్రియల రేటు పెరుగుతాయి. శరీరంపై ఒత్తిడి సైతం అధికమవుతుంది. వీటన్నింటినీ అదుపులో ఉంచాలంటే… వ్యాయామం తరువాత కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. కాసేపటి తరువాత చురుగ్గా మారిపోతారు.
* వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయడం మంచిది. స్వేద రంధ్రాలు మామూలు స్థితికి చేరుకుంటాయి. రోజంతా తాజాగా, ఉత్సాహంగా ఉంటారు. చెమట పట్టిన దుస్తులు ఎక్కువ సేపు ధరించడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని మరవకండి.
* ఓ గంట, గంటన్నరసేపు వ్యాయామాలు చేశాక… ఇంటికి వచ్చేయడం కాదు. శరీరాన్ని పూర్తిగా స్ట్రెచ్‌ చేయాలి. ఒక్కో శరీర భాగాన్ని ముప్పై సెకన్ల పాటు స్ట్రెచ్‌ చేయడం వల్ల కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.
* అలసిన శరీరానికి శక్తి కావాలంటే… ఏదో ఒకటి తప్పకుండా తినాలి. దీన్ని పోస్ట్‌ వర్కవుట్‌ మీల్‌ అంటారు. గుడ్డు తెల్లసొన, రెండు ఇడ్లీ… ఇలా ఏవో ఒకటి తీసుకోవడం అవసరం.
* ముఖంపై చెమట ప్రభావం పడకుండా ఉండాలంటే… చర్మానికి కొద్దిగా గులాబీనీరు రాసుకోవాలి. అవసరం అనుకుంటే… తలస్నానం చేయడం మంచిది.