Movies

నా భర్త ట్రంప్ కంపెనీ

Rakhi Sawanths Husband Works For Donald Trump

బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్(40) ఇండియాస్‌ గాట్‌ టాలెంట్ షో కంటెస్టెంట్‌ దీపక్‌ కలాల్‌ను వివాహం చేసుకోబోతున్న‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే . కొద్ది రోజుల త‌ర్వాత మా పెళ్లి జ‌ర‌గ‌డం లేద‌ని తెల్చి చెప్పింది. క‌ట్ చేస్తే రాఖీ సావంత్ ఓ ఎన్నారైని ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంద‌ని అనేక పుకార్లు షికారు చేశాయి. జూలై 28న ఆమె పెళ్లి జ‌రిగింద‌ని వార్త‌లు రాగా, దానిని ఖండించింది. ‘జేడబ్ల్యూ మారియట్‌లో నేను పెళ్లి షూట్‌లో పాల్గొన్నాను. అంత‌ మాత్రం దానికి నాకు పెళ్లైపోయిందని ఎందుకు ప్ర‌చారం చేస్తున్నారో నాకు అర్ధం కావ‌డం లేదు. నేను ఎవ‌రితో రిలేష‌న్‌లో లేను. ఇప్ప‌టికి సింగిల్‌గానే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది రాఖీ సావంత్. రాఖీ సావంత్ తాజాగా తాను రితేష్ అనే ఎన్నారై బిజినెస్‌మెన్‌ని ముంబైలో వివాహం చేసుకున్న‌ట్టు తెలిపింది. జూలై 20న త‌మ పెళ్లి చాలా సీక్రెట్‌గా, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో జ‌రిగింద‌ని చెప్పుకొచ్చింది. అయితే తాను సీక్రెట్‌గా వివాహం చేసుకోవ‌డంపై స్పందించిన రాఖీ.. నా భ‌ర్తకి హ‌డావిడి ఎక్కువ‌గా న‌చ్చ‌దు. మీడియా, ఫోటోలు వంటి వాటిపై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డు. ఫ్యామిలీ మ‌ధ్య‌నే వివాహం జ‌రుపుకోవ‌డం త‌న‌కి ఇష్టం అని పేర్కొంది. అత‌ను హిందూ ఎన్ఆర్ఐ కాగా, నేను క్రిస్టియ‌న్‌. అందుకుగాను మేమిద్ద‌రం చ‌ట్ట ప‌రంగా వివాహం చేసుకున్నాము. నా భ‌ర్త డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన కంపెనీలో ప‌ని చేస్తున్నారు. అత‌నికి బాలీవుడ్ అంటే ప్రేమ‌. వాట్సాప్ చాటింగ్‌తో మొద‌లైన మా ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఆయ‌న‌కి మంచి త‌ల్లితండ్రులు, సోద‌రి ఉన్నారు. పెళ్లైన‌ప్ప‌టికి నేను బాలీవుడ్‌లో సినిమాలు చేస్తాన‌ని రాఖీ తెలియ‌జేసింది.