DailyDose

మార్కెట్‌లోకి యాపిల్ క్రెడిట్ కార్డులు-వాణిజ్య-08/07

Apple Cards Introduced To General Public-Telugu Business News Today-Aug72019-మార్కెట్‌లోకి యాపిల్ క్రెడిట్ కార్డులు-వాణిజ్య-08/07

*యాపిల్ సంస్థ తన మొబైల్ వినియోగదారుల కోసం తొలిసారిగా రూపొందించిన క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే రిక్వెస్ట్ పెట్టుకున్నవారంతా మంగళవారం నుంచి యాపిల్ వాలెట్ యాప్ ద్వారా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఆమోదం చెల్లింపుల వ్యవహారాలన్నీ యాపిల్ భాగస్వామ్య సంస్థ గోల్డ్ మాన్ సాచ్ పర్యవేక్షిస్తుంది.
*టాటా గ్రూప్ సంస్థ టైటన్ కంపెనీ జూన్ త్రైమాసికంలో రూ.363.74 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఐఎల్అండ్ఎఫ్ఎస్ పూర్వ ఆడిటర్లు డెలాయిట్, బీఎస్ఆర్ అండ్ అసోసియేట్స్కు మరిన్ని చిక్కులు చుట్టముట్టనున్నాయి.
*అంతర్జాతీయంగా స్థిరాస్తి రంగంలో వస్తున్న మార్పులను చర్చించేందుకు జాతీయ స్థాయి ‘11వ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (నార్)- ఇండియా’ వార్షిక సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది.
* దేశంలో 5500 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్కు చెందిన బీపీ పీఎల్సీలు సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నాయి.
*కేఫ్ కాఫీడే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ రాసినట్లు భావిస్తున్న చివరి లేఖలో సంతకం ధ్రువీకరణ విషయంలో నియంత్రణ సంస్థలకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది.
*రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నేడు ప్రకటించబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో, కీలక రేట్లలో పావుశాతం మేర కోత విధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
*ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మంగళవారం రుణ రేట్లను తగ్గించింది. అన్ని రకాల కాలపరిమితి రుణాలపై వడ్డీని 0.10 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
*అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. చైనా కరెన్సీ మానిప్యులేటర్ (కరెన్సీ విలువను అవసరానికి అనుగుణంగా మార్చడం) అని అమెరికా అధికారికంగా ముద్రవేసింది.
*దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరించే పనులు మొదలయ్యాయి.
*మన దేశంలో 2 బిలియన్ డాలర్లను (సమారు రూ.14,000 కోట్లు) పెట్టుబడి పెట్టాలని ఆస్ట్రేలియా, కెనడా సంస్థలు నిర్ణయించాయి.
*ఆన్లైన్ కొనుగోళ్ల సమయంలో చెల్లింపులు నిలిచిపోవడం సమస్యగా మారుతోంది. మొబైల్ ద్వారా జరిపే లావాదేవీల్లో అయితే 20 శాతం వరకు ఇలా నిలిచిపోతున్నట్లు గుర్తించారు.
*దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య విభేదాలు ఇంకా తీరలేదు. ఇండిగోలో పరిష్కృతం కాని అనేక తీవ్ర సమస్యలు ఉన్నాయని సహ ప్రమోటర్ రాకేశ్ గంగ్వాల్ తాజాగా వెల్లడించారు.