లవణాల లోపమో, క్యాల్షియం లోపమో పిక్కలు పట్టేయడానికి దాదాపు ఇలాంటి కారణాలే ఉంటాయనుకుంటాం. కానీ, అంతకన్నా భిన్నమైన కారణాలు అనేకం. ఈ సమస్య కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైనది అయితే, పిక్కల పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కాకపోతే ఈ నొప్పి నడక ప్రారంభించిన వెంటనే మొదలవుతుంది. అయితే, పిక్కలు పట్టేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉంటాయి.రక్తనాళాలు మూసుకుపోయే ఎథిరోస్కెరోసిస్ సమస్య కూడా పిక్కలు పట్టేసేందుకు ఒక కారణం అవుతుంది. ఈ సమస్య వల్ల కాళ్లకు అవసరమైనంత రక్తం అందదు. ‘ఆర్టీరియనల్ క్లాడికేషన్’ అనే ఈ సమస్య ఉన్నవారిలో నడక ప్రారంభించిన వెంటనే పిక్కలు పట్టేయవు గానీ, కొద్ది నిమిషాల తర్వాత నొప్పి మొదలవుతుంది.పిక్కలు పట్టేయడానికి దారి తీసే మరో కారణం ‘స్పైనల్ స్టెనోసిస్’. వెన్ను పూసలు అరిగిపోయే ఈ సమస్యలో వెన్నుపాముకూ, వెన్ను పూసలకూ మధ్యన ఉండే ఖాళీ తగ్గిపోతుంది. ఇలా కావడాన్ని ‘న్యూరోజెనిక్ క్లాడికేషన్’ అంటారు. వివిధ రూపాల్లో ఈ సమస్య తీవ్రమవుతుంది. దీని లక్షణాలు, ఆర్టీరియల్ క్లాడికేషన్తో పోలిస్తే చాలా భిన్నమైనవి. ముఖ్యంగా,న్యూరోజెనిక్ సమస్య నడుస్తున్నప్పుడే కాదు, ఎక్కువ సమయం నిలుచున్నప్పుడు కూడా తలెత్తుతుంది.నడుము భాగం నుంచి ముందుకు వంగినప్పుడు గానీ, కేవలం శరీర భంగిమను మార్చినప్పుడు గానీ, పిక్కలు పట్టేయడం ద్వారా వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.ఈ నొప్పి పిక్కల్లోనే కాదు, తొడలు, పిరుదులు, నడుము భాగాల్లో కూడా వస్తుంది.కాళ్లల్లో బలహీనత ఏర్పడటంతో పాటు, నొప్పి కూడా తలెత్తుతుంది.‘న్యూరోజెనిక్ క్లాడికేషన్’ నొప్పి నడక ఆపేయగానే తగ్గకపోగా, విశ్రాంతి వేళల్లో కూడా నొప్పి వస్తుంది.ఏమైనా ఆర్టీరియల్, ‘న్యూరోజెనిక్ క్లాడికేషన్’ సమస్యను డాక్టర్లు చాలా సులభంగానే గుర్తిస్తారు. పలురకాల సమర్థమైన వైద్య చికిత్సలు కూడా ఈ సమస్యకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల పిక్కల నొప్పి మొదలైన వెంటనే వైద్య చికిత్సలకు వెళ్లగలిగితే, ఈ సమస్య నుంచి బయటపడటం పెద్ద కష్టమేమీ కాదు.
పిక్కలు పట్టేస్తే క్యాల్షియం తగ్గిందేమో చూసుకోండి
Related tags :