Devotional

శ్రావణ మాసం…లక్ష్మీ దేవి కటాక్షం

Importance Of Sravana Masam...శ్రావణ మాసం లక్ష్మీ దేవి కటాక్షం

1. ఈ మాసం ప్రతి ఇంటా లక్ష్మీ కళ –ఆద్యాత్మిక వార్తలు 08/07
శ్రావణమాసం… ఆహ్లాదాలనే కాదు ఆధ్యాత్మిక సౌరభాలనూ వెదజల్లే కాలమిది… ఈ నెలలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనా… కొన్ని పర్వదినాలు మాత్రం మరింత విశేషమైనవి…
*మంగళగౌరీ వ్రతం
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం విశేషమే. ఆ రోజు మంగళగౌరీ దేవిని మహిళలు అర్చిస్తారు. తన భర్త అయిన శివుడు కాలకూట విషం తాగినా… తన మాంగల్యానికి ఏ ప్రమాదం లేదని నిశ్చయంగా ప్రకటించిన దేవత మంగళగౌరి. ఆమెకే సర్వ మంగళ అని పేరు. ఈ మాసంలో ప్రతి మంగళవారం రోజు మహిళలు ఈ మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. ముఖ్యంగా నవ వధువులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. వ్రతం రోజు మహిళలు పూజావేదికపై మంగళగౌరిని ప్రతిష్ఠించి, చేతికి తోరాలు కట్టుకుంటారు. వ్రతకథను విని తోటి ముత్తయిదువులకు శెనగలు, చలిమిడి వాయినంగా ఇస్తారు.
*శుక్రవారం… వరలక్ష్మి
శ్రవణా నక్షత్రం శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం. ఈ నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమైన శ్రావణం చాలా శుభప్రదం. ఈ మాసంలో రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం ఆచరించడం సంప్రదాయం. పౌర్ణమి ముందు వచ్చే ఈ శుక్రవారం విశేషమైందని చెబుతారు. పురాణాల ప్రకారం చారుమతికి కలలో కనిపించి వరలక్ష్మీదేవి ఈ వ్రతవిధానాన్ని ఉపదేశించింది. కొత్తకోడలికి అత్తవారు ఈ శ్రావణమాసంలో ఇచ్చే కానుకను ‘శ్రావణపట్టీ’ అంటారు. అందులో లక్ష్మీదేవి ప్రతిమ(రూపు) ఉంటుంది. ఆ బంగారు ప్రతిమను పూజావేదికపై అమర్చుకొని, కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. చారుమతీ వృత్తాంతం ప్రధానాంశంగా గల వ్రతకథను విని, ముత్తయిదువలకు వాయినాలు ఇస్తారు.
*శ్రావణ పౌర్ణమి
మహావిష్ణువు హయగ్రీవరూపంలో అవతరించిన పర్వదినం శ్రావణ పౌర్ణమి. ఆ సంవత్సరమే ఉపనయనం అయిన వటువులకు ఈ పూర్ణిమనాడు ఉపాకర్మ నిర్వహిస్తారు. విద్యాభ్యాస శుభారంభ పర్వదినం ఇది. నూతన యజ్ఞోపవీతధారణ కూడా ఆ రోజే. లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం హయగ్రీవుని అనుగ్రహంతో కలుగుతుంది. అందుకే ఈ రోజు మహావిష్ణువును.. విశేషంగా హయగ్రీవ రూపంలో ఆర్చించే సంప్రదాయం ఉంది. వేదరూపుడైన దత్తాత్రేయుణ్ని, వేదమాత గాయత్రీదేవిని అర్చించే విధానమూ ప్రచారంలో ఉంది. సోదరీ సోదరుల ప్రేమకు సంకేతంగా నిర్వహించే రాఖీ పండగ కూడా ఇదే రోజు.
*శ్రీకృష్ణాష్టమి
శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి నాడు దేవకీవసుదేవులకు శ్రీకృష్ణుడు పుత్రుడుగా జన్మించాడని భాగవతం చెబుతోంది. ఈ పర్వదినాన్ని కృష్ణాష్టమిగా చేసుకుంటారు. దీనినే గోకులాష్టమి, జన్మాష్టమిగా పిలుచుకుంటారు. ఈ రోజు శ్రీకృష్ణుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి, పాలు, పెరుగు, వెన్న మొదలైనవి నివేదన చేస్తారు. మరో సంప్రదాయం ప్రకారం బాలింతలకు పెట్టే పదార్థాన్ని స్వామికి నివేదన చేస్తారు. వేయించిన మినపపిండిలో పంచదార కలిపి దీనిని తయారుచేస్తారు. కొన్ని ప్రాంతాల్లో శొంఠి, మిరియం కలిపి బాగా నూరి, బెల్లంతో పాకంపట్టి, తగినంత నెయ్యి కలిపి నైవేద్యం తయారు చేస్తారు. దీనిని ‘కట్టె కారం’, ‘కాయం’, ‘శొంఠి ఉక్కిరి’ ఇలా వేర్వేరు ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఉట్టికొట్టే వేడుకలను సంబరంగా నిర్వహిస్తారు.
2. పవిత్రం ప్రదానం..దోషం.. పరిహారం-10న శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 11 నుంచి 13 వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు ఈనెల 10న అంకురార్పణ జరగనుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ఈ క్రతువును తితిదే ప్రారంభించనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సేనాధిపతి విష్వక్సేనుల వారిని ఆలయంలోని వసంత మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం చేశాక.. ఆస్థానం జరుపుతుంది. ఆ తర్వాత పవిత్ర మండపంలోని యాగశాలలో వైదిక క్రతువులు ప్రారంభిస్తుంది.
*ఎందుకీ వేడుక?
పవిత్రోత్సవాలను ‘దోష నివారణ’, ‘సర్వయజ్ఞ ఫలప్రద’, ‘సర్వదోషోపశమన’, ‘సర్వతుష్ఠికర’, ‘సర్వకామప్రద’ తదితర పేర్లతోనూ పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడిన పదమే పవిత్రోత్సవం. ఈ సందర్భంగా స్వామివారికి, ఉత్సవమూర్తులకు పవిత్రాలు సమర్పిస్తారు. ఈ పవిత్రాలు తయారు చేయడానికి ఉపయోగించే పత్తిని కూడా సాధారణ మొక్కల నుంచి తీయరు. తులసి వనం మాదిరిగా ప్రత్యేకంగా తోటలో గింజలు నాటి.. పెంచిన మొక్కల నుంచి వచ్చే పత్తిని మాత్రమే ఉపయోగిస్తారు. పవిత్రాల తయారీకి 20 మూరల పట్టుదారం లేదా 200 మూరల నూలుదారం వాడతారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులను అద్దుతారు. ఆలయ మొదటి ప్రాకారంలోని వగపడి వరండాలో ఉత్తరం వైపున ఉన్న పురాతన శిలాశాసనంలో.. పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ‘పవిత్ర తిరునాల్’ ఈ వేడుకలు నిర్వహించగా.. నాడు వినియోగించిన పూజాసామగ్రి, వాటి ధరవరల వివరాలు శాసనంలో పొందుపరిచారు.
3. వైభవంగా పుష్పయాగం
వినుకొండపట్టణంలోని శ్రీనివాసనగర్లోని వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం పుష్పయాగం నిర్వహించారు. ప్రత్యేక వేదికపై అలువేలు మంగ సమేత శ్రీవారి ఉత్సవ విగ్రహాలు ఉంచి సుమారు 1000 కిలోల పూలు, పత్రాలు సమర్పించారు. పెద్దబజారులోని చిన్న జీయర్ ఆశ్రమం నుంచి స్వామిని రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. రథంతో పాటు మల్లికాప్రసాద్ ఆధ్వర్యంలో 108 మంది దంపతులు పూల బుట్టలు పట్టుకుని పాటలు పాడుతూ ఆలయానికి చేరుకున్నారు. పండితుడు పరాశరం రంగనాథాచార్యుల బృందం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది. మధ్యాహ్నం అన్నదానం చేశారు. సాయంత్రం అమ్మ వారితో పాటు స్వామి అలంకరించి ద్వాదశ ప్రదక్షణ సేవ చేపట్టారు. రాత్రి పవళింపు సేవతో ఆరో రోజు కార్యక్రమం ముగిసింది. ఉత్సవమూర్తులకు విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టాబత్తిన వెంకటకృష్ణయ్య దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ పెద్దలు రెడ్డి బంగారయ్య, ద్రోణాదుల అప్పారావు, కాళ్ల రామకోటేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
4. శుభమస్తు
తేది : 7, ఆగష్టు 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 36 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 45 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(నిన్న రాత్రి 10 గం॥ 28 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 40 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 24 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 41 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 46 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 57 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 56 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 47 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : తుల
5. చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 7-జిమ్మీవేల్స్
1890 : గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు, ‘గ్రంధాలయ పితామహుడు’గా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జననం మ.1979).
1925: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ జననం.
1941: భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మరణం (జ.1861).
1960: ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్యదినోత్సవము.
1966 : అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్, వికీపీడియా ను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రోజెక్టులు ప్రారంభించిన వ్యక్తి జిమ్మీ వే జననం.
1980 : భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2004 లో ఫ్రాన్స్ లోని టౌలోస్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ లో విజయం సాధించిన చేతన్ ఆనంద్ జననం.
2018 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మరణం. (జ.1924 )

6. ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: endow-eokadiri@gov.in, ac_eo_kadiri@yahoo.co.in
07.08.2019 వతేది, బుధవారము ఆలయ సమాచారం
శ్రీస్వామి వారి దర్శన వేళలు : ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ.. శ్రీ స్వామి వారి జన్మదిన నక్షత్రమైన స్వాతి నక్షత్రము తేది:07.08.2019న బుధవారము సందర్బముగా ఉదయం 6.30 గం|| నుండి 7.30 గం||ల వరకు శ్రీ స్వామి వారి (మూలవర్ల) నిజరూప దర్శనము వుంటుంది అనంతరము ఉదయం 7.30 గం|| నుండి మూలవర్లకు విశేషముగా పంచామృత అర్జిత అభిషేక సేవ సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు… తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును..రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
**ఆర్జిత సేవాల వివరములు
07.08.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) స్వాతి నక్షత్రము అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్:85
7. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు బుధవారం 07-08-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ……
శ్రీవారి దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు…..
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది….
నిన్న ఆగస్టు 6 న 74,565 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 2.86 కోట్లు.