భారత స్వాతంత్ర్య దినోత్సవం రానున్న సందర్భంగా సిలికాన్ వ్యాలీలోని శాంటా క్లారా కౌంటీ ఫెయిర్ గ్రౌండ్ లో గత శనివారం ఇండియా పెరేడ్ నిర్వహించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ తానా, స్థానికంగా ఉన్న భారతీయ సంఘాలు స్వదేశీ ఫెయిర్ లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇండియన్ ఐడెల్ విజేత ‘రేవంత్’ నిర్వహించిన సంగీత కచేరి ఆకట్టుకుంది. భారత కాన్సుల్ జనరల్ సంజయ్ పాండా శానోసే సిటి మేయర్ సామ్ లిక్కర్దో, తానా మాజీ అద్యక్షుడు కోమటి జయరాం తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సిలికాన్ వ్యాలీలో ఉన్న నలభైకి పైగా ప్రవాస బారతీయ సంఘాల ఆద్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
సిలికాన్ వ్యాలిలో ఘనంగా ఇండియన్ ఫెయిర్
Related tags :