ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. గరవ్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమింపబడ్డ పలువురు తమ కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేశారు.. ఈ క్రమంలోనే రాజకుమారి కూడా రాజీనామా చేశారు.అనంతరం ఆమె మాట్లాడారు.. తాను పనిచేసిన మూడేళ్ల రిపోర్ట్‌ను గవర్నర్‌కు అందజేసినట్టు తెలిపారు. మహిళా కమీషన్ చైర్‌పర్సన్ గా తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించానని.. తన హయాంలో ఎందరో మహిళా బాధితులకు అండగా నిలిచినట్టు పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని రాజకుమారి చెప్పారు.
రాజక్క రాజీనామా
Related tags :