ద్వైమాసిక పరపతి సమీక్షను నిర్వహించిన ఆర్బీఐ… ఇవాళ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేట్లపై 35 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి తగ్గగా… రివర్స్ రెపో 5.15 శాతంగా ఉంది. జులై-సెప్టెంబర్‌కు 3.4 శాతంగా ద్రవ్యోల్బణం అంచనా వేయగా.. ఈ ఆర్థిక ఏడాది జీడీపీ వృద్ధి రేటు అంచనాను… 7.4 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. దీంతో వ్యక్తిగత, గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు తగ్గనున్నాయి. మానిటరీ పాలసీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతున్నారు.
వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్.బీ.ఐ
Related tags :