సిలికానాంధ్ర మరో రికార్డును నెలకొల్పింది. ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు, ఇప్పటి వరకు ₹50కోట్లకి పైగా విరాళాలుగా అందజేసిన డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డికి రోటరీ క్లబ్ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. గత 4వ తేదీన ప్రముఖ తెలుగు సంస్థ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో మిల్పిటాస్ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ గవర్నర్ రమేష్ హరిహరన్ ఆధ్వర్యంలో రోటరీ ప్రతినిధులు పాల్ హరీష్ ఫెలో పేరుతో రూపొందించిన అత్యున్నత అవార్డును డా. హనిమిరెడ్డికి అందజేసి సత్కరించారు. ఇదే కార్యక్రమంలో సిలికానాంధ్ర ఏర్పడి 18ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వార్షిక వేడుకలను నిర్వహించారు. ఇప్పటి వరకు ఏడు గిన్నిస్ రికార్డులను సాధించిన సిలికానాంధ్ర మరో రికార్డును నెలకొల్పింది. 221 మంది సభ్యులతో సిలికానాంధ్ర రోటరీ క్లబ్‌ను నెలకొల్పింది. గత 114 సంవత్సరాల రోటరీ క్లబ్ చరిత్రలో ఒకేసారి ఇంత మంది సభ్యులతో రోటరీ క్లబ్‌ను నెలకొల్పడం రికార్డని సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వయోలిక్ విద్వాంసులు అశోక్ గుర్జాలే ఆధ్వర్యంలో పద్దెనిమిది మంది శిష్య బృందం ఇచ్చిన వయోలిన్ ప్రదర్శన ప్రవాసాంధ్రులను ఆకట్టుకుంది.
సిలికానాంధ్ర మరో రికార్డు…డా.లక్కిరెడ్డికి అత్యున్నత పురస్కారం
Related tags :