అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు శివాజీ అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది. ఇటీవల ఆయాన అమెరికా వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం పై ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారించిది. అలంద మీడియా కేసులో జారీ అయిన లుకౌట్ నోటీసులు తొలగించారని హైకోర్టు ఆదేసించినా పోలీసులు తొలగించలేదని శివాజీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆయన అమెరికా వెళ్తుండగా పోలీసులు ఆపారన్నారు. దుబాయి ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా ఆపి వెనక్కు పంపారని వివరించారు. ఇమ్మిగ్రేషన్ వెబ్ సైటులో లుకోట్ నోటీసులు తొలగించలేదన్నారు. దీన్ని కోర్టు దిక్కరనగా పరిగణించాలని న్యాయవాది కోరారు.
శివాజీ అమెరికా వెళ్ళడానికి అనుమతి
Related tags :