అవును.. నన్ను అరెస్టు చేశారు అంటున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. అస్లీసోనాఅరెస్టెడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిన్నటి నుంచి ఓ వీడియో ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ‘ మీరు నన్ను ఇలా అరెస్టు చేయకూడదు. అసలు నేనెవరో తెలుసా? నేనే తప్పూ చేయలేదు. ఇలా ఎలా అరెస్టు చేస్తారు’ అంటూ సోనాక్షి నిలదీస్తున్నట్లుగా ఉన్న వీడియోను చూసి ఆమె అభిమానులు బెంబేలెత్తిపోయారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలుసుకుని హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. మైగ్లామ్ అనే మేకప్ కలెక‌్షన్ బ్రాండ్ తరఫున సోనాక్షి ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా ఆమె అరెస్టు అయినట్లుగా ఉన్న వీడియోను రూపొందించారు. ఈ క్రమంలో తన కొత్త యాడ్ విశేషాలను సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘ అవును నన్ను అరెస్టు చేశారు. ఎందుకో అడగండి?- ఎందుకంటే ఇంత అందంగా కనిపించడం నేరం కాబట్టి.!!! మై గ్లామ్ తరఫున ప్రచారం చేస్తున్నానని చెబుతున్నందుకు ఉద్వేగానికి లోనవుతున్నా. దీని ఉత్పత్తులతో మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎప్పుడైనా..ఎక్కడైనా’ అని మరోసారి ప్రోడక్ట్‌ను ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను సోనాక్షి అక్షరాలా పాటిస్తోందని.. అయితే అందుకు ఆమె చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు కాస్త చిరాకు తెప్పిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు
సోనాక్షి అరెస్ట్
Related tags :