*ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్మన్ గా శ్రీమతి వాసిరెడ్డి పద్మను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
* గోదావరిలో వరద నీరు పెరగడంతో ప్రభావితమైన గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటు అదనంగా ఆయా కుటుంబాలకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. ఇళ్లు, పంట నష్టపోయినా నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు.ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకనే ప్రత్యేకంగా ఈ రూ.5వేలు సహాయం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. మానవతా దృక్పథంతో గిరిజనులను ఆదుకోవాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
* కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపతి కల్పించే 370 అధికరణను భారత్ రద్దు చేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టం చేసినప్పటికీ పాక్ మాత్రం కశ్మీర్‌పై భారత్ వైఖరిని తప్పుబడుతోంది. అంతే కాదు.. కోరి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికే భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్తాన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును పాక్ నిలిపివేసినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశమైంది. 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్ ప్రెస్ భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. వీక్లీ ఢిల్లీ నుంచి లాహోర్‌కు రాకపోకలు సాగించే ఈ ట్రైన్ సర్వీసును ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ నిలిపివేసినట్లు తెలిసింది.
* వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను కేంద్రం అత్యుత్తమ పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. పాక్ చెరలో చిక్కినప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకుగానూ ‘వీర్ చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సమాచారం. సైన్యానికి పరమ్‌వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం.ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-16ను తాను ప్రయాణిస్తున్న మిగ్ విమానంతో అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అనంతరం తన మిగ్ కూడా కూలిపోవడంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నేలపైకి దిగాడు. అక్కడి స్థానికులు ఆయన్ను పట్టుకుని పాక్ సైన్యానికి అప్పగించారు. ఎంత ఒత్తిడి చేసినా అభినందన్ మిలిటరీకి సంబంధించిన ఎలాంటి సున్నిత సమాచారాన్ని బయటపెట్టలేదు. తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయడంతో పాకిస్థాన్ ప్రభుత్వం వర్థమాన్‌ను వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది.
* ప్రపంచ ఛాంపియన్షిప్కు తనను పరిగణనలోకి తీసుకోకపోవడంపై తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ అసంతృప్తి వ్యక్తంజేసింది. సెలెక్షన్స్ నిర్వహించకుండా క్రీడాకారిణుల్ని ఎలా ఎంపిక చేస్తారని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ)ను ప్రశ్నించింది. అక్టోబరు 3 నుంచి 13 వరకు రష్యాలో జరుగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం సెలెక్షన్ కమిటీ మేరీకోమ్ (51 కేజీలు), లవ్లినా బోర్గోహైన్ (69 కేజీలు)లను భారత జట్టుకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఇండియా ఓపెన్, ఇండోనేసియా టోర్నీల్లో మేరీకోమ్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. గతంలో తొమ్మిదిసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ బరిలో దిగిన మేరీకోమ్ ఆరు స్వర్ణాలు, ఒక రజతం గెలుచుకుంది. ‘‘ఇండియా ఓపెన్ సెమీస్లో నిఖత్ను మేరీకోమ్ ఓడించింది. ప్రదర్శన, అనుభవం ప్రకారమే మేరీకోమ్ను ఎంపిక చేశాం. భారత్కు పతకం సాధించే క్రీడాకారిణికే మొదటి ప్రాధాన్యమిచ్చాం’’ అని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ రాజేశ్ భండారి తెలిపాడు. సెలెక్షన్ కమిటీ నిర్ణయంపై ప్రపంచ జూనియర్ మాజీ ఛాంపియన్ నిఖత్ (51 కేజీలు) మండిపడింది. ‘‘చివరి నిమిషంలో సెలెక్షన్ బౌట్ను అర్ధంతరంగా రద్దుచేశారు. 2016 ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొన్నా. నాలో సత్తా ఉంటే 2019లో కూడా బరిలో దిగుతా. బీఎఫ్ఐ తక్షణం జోక్యం చేసుకుని దేశంలోని ప్రతి ఒక్క బాక్సర్లో నమ్మకం కలిగించాలి. అందరికీ ఒకే నిబంధన ఉండాలి’’ అని 23 ఏళ్ల నిఖత్ తెలిపింది.
*అవినీతికి పాల్పడుతూ విద్యుత్‌శాఖకు చెందిన ఏఈ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో చోటుచేసుకుంది. కరెంట్ ఏఈ పర్వతాలు ఓ రైతు నుంచి రూ. 12 వేల నగదు లంచంగా తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.
*పాకిస్తాన్ మాజీ ప్రధాని, ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షడు నవాజ్ షరీఫ్ కూతురు మారియమ్ నవాజ్‌ను గురువారం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) లాహోర్‌లో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో ఇంతవరకు కారణం చెప్పలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మారియం ఔరంగజేబ్ తెలిపారు. అయితే ఇంతకు ముందు ఆమెకు చౌదరి షుగర్ మిల్స్ కేసులో వివరాలు సమర్పించాల్సిందిగా నాబ్ సమన్లు జారీ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు భావిస్తున్నారు.
*గోదావరి వరదలపై అధికారులతో ముగిసిన సీఎం సమీక్షముంపుబాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇప్పుడిస్తున్న సహాయం కాకుండా అదనంగా రూ.5వేల రూపాయల చొప్పున సహాయం చేయాలని ఆదేశంపునరావాస శిబిరాల్లో ఉంటున్నవారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీయే కాకుండా అదనంగా రూ.5వేల సహాయం.ఇళ్లునష్టపోయినా, పంట నష్టపోయినా …. వీటికి నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం.ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70శాతానికిపైగా గిరిజన గ్రామాలున్నాయి.
* విదేశాంగ శాఖ మాజీ మంత్రి , బీజేపీ అగ్రనాయకురాలు, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అస్థికలను గంగా నదిలో కలిపారు ఆమె కుటుంబసభ్యులు. ఉత్తర్ ప్రదేశ్ లోని హపూర్ దగ్గర్లో అస్థికల నిమజ్జనం నిర్వహించారు. కూతురు బన్సూరి.. తన తల్లి సుష్మాస్వరాజ్ అస్థికలు, చితాభస్మాన్ని నీళ్లలో కలిపారు. భర్త స్వరాజ్ కౌశల్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పడవలో గంగానది మధ్యలోకి వెళ్లి.. అస్థికలను నీళ్లలో వదిలారు కుటుంబసభ్యులు. సుష్మాస్వరాజ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
*మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులకు చేరే విధంగా త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శత్రువు ఎక్కడో లేడు.. మన పక్కనే సెల్‌ఫోన్ రూపంలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణకై ప్రభుత్వం… పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మిత్రలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితతో కలిసి విశాఖపట్నంలో మహిళా మిత్ర సేవలను ప్రారంభించారు.
*ర్నాటక, కేరళ రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వర్షం కురుస్తున్నది. భారత వాతావరణ శాఖ ఆ రెండు రాష్ట్రాలకు ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కోస్టల్ కర్నాటక, కొంకన్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా తీరం వెంట భారీ వర్షం పడే సూచనలు ఉన్నట్లు ఐఎండీ చెప్పింది. మహారాష్ట్రలో ఇప్పటికే పదహారు మంది మృతిచెందారు. పూణె డివిజన్‌లోని సోలాపూర్, సంగ్లీ, సతారా, కొల్హపూర్ ప్రాంతాలు ఏకధాటి వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో కూడా పలు ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి.పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే …
*ఆర్టికల్ 370 రద్దుతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద సంస్థ జేషే మొహమ్మద్ దాడులు చేయనున్నట్లు హెచ్చరికలు చేసింది. దీంతో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ వ్యాలీతో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో దాడులు జరగనున్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులకు పాక్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఊతమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో జేషే దాడులకు ప్లానేసినట్లు అనుమానిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో బందోబస్తును పెంచారు. ఆగస్టు 10 నుంచి 20వ తేదీ వరకు విమానాశ్రయాల్లోకి విజిటర్స్‌ను అనుమతించడం లేదు. కేవలం టికెట్లు ఉన్న ప్రయాణికులు మాత్రమే ఎయిర్‌పోర్టుకు రానిస్తారు.
*కొన్ని నెలల క్రితం కరువుతో కటకటలాడిన మహారాష్ట్ర ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అతాలకుతలం అవుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర పశ్చిమ జిల్లాలు. వరదల కారణంగా వివిధ ప్రాంతాల్లోని 1.32 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
*ఓపెన్ స్కూల్ ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు 60 కేంద్రాలలో, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు 47 కేంద్రాలలో, ప్రాక్టికల్స్ పరీక్షలు 17 కేంద్రాలలో నిర్వహించినట్లు చెప్పారు. పదవ తరగతి పరీక్షలకు 14,676 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 9,382 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 63.9 శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు తెలిపారు.
*భాజపా సీనియర్ నేత సుష్మాస్వరాజ్‌కు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ నివాళులర్పించారు. పూరీ తీరంలో సుష్మా చేసిన చివరి ట్వీట్‌తో కూడిన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది.. ఆమెకు నివాళులర్పించారు.
* శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరదనీరుఇన్ ఫ్లో 3లక్షల64వేల259 క్యూసెక్కులు అవట్ ప్లో :1,15,481క్యూసెక్కులు శ్రీశైలం కుడిగట్టు , ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 215 టిఎంసిలుప్రస్తుత నీటి నిల్వ : 168.2670 టిఎంసిలు.పూర్తి స్థాయి నీటిమట్టం : 885డుగులుప్రస్తుత నీటి మట్టం : 876.00 అడుగులు
*నెల్లూరు జిల్లా కావలి టౌన్ లో105.. సబ్ డివిజన్ లో 218 సి.సి కెమెరా ల తో నిఘా..నేరాల అదుపు కు పటిష్ఠమైన చర్యలతో ప్రజల భధ్రతలో కార్యక్రమం కావలి పోలీస్ శాఖ.ప్రైవేట్ సంస్థలు కూడా చొరవ తీసుకుని కెమెరా వ్యవస్థ ను వినియోగం చేసుకోవాలని డి.యస్. పి ప్రసాద్, సి.ఐ రోశయ్య, ఒన్ యస్.ఐ వెంకటరావు గురువారం విలేకరుల సమావేశంలో కోరారు.పెద్దపాడు ఉన్నత పాఠశాలలో కోలాహలంగా ఆటలపోటీలు
*వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే పని చేస్తున్న ఏఎన్ఎంలను ఆందోళనకు గురిచేసింది. తమకు కొనసాగిస్తారా? లేక ఇంటికి పంపించేస్తారా? అనే ప్రశ్నలకు కారణమైంది. అయితే, వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే పని చేస్తున్న ఏఎన్ఎంలకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ. వారికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపింది. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎంలకు ఉద్యోగ భద్రత ఉంటుందని.. రాత పరీక్షలో అర్హత పొందనివారిని కూడా యథావిథిగా కొనసాగిస్తామని.. రాత పరీక్షలో అర్హత పొందిన ఏఎన్ఎంల వేతనం విషయంలో ఉన్న అంతరాన్ని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. శాశ్వత ప్రాతిపదికన ఏఎన్ఎం పోస్టులు భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తుతం పని చేస్తున్న 7,418 ఏఎన్ఎంలు వినియోగించుకోవచ్చని సూచించిన ప్రభుత్వం.. ఏఎన్ఎంగా పని చేస్తూ పరీక్షకు హాజరయ్యే వారికి పది శాతం మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని ప్రకటించింది.
*లక్మినగర్ ప్రాంతంలో పిచ్చికుక్క స్పైర విహారం…జన్మభూమి జంక్షన్ లోని స్థానికులపై దాడి 4 గురికి గాయాలు…
*ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు.అన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొనసాగుతున్న తనిఖీలు.జమ్మూకాశ్మీర్ లో ప్రతి కిలోమీటర్ కి ఒక crpf క్యాంపు.దేశవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా.అన్ని రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని ఆదేశం.
*నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వర్గీయులు దౌర్జన్యంఆర్ అండ్ బి అతిధి గృహంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి ని అడ్డుకున్న కావలి వైసీపీ నేతలుమీడియా సమావేశం ఆపేసి R$ B అతిథి గృహం కాలీ చేయాలంటూ అధికారులు చే హుకుం జారీ చేయించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వర్గీయులు..అధికారులచే బలవంతంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి కాలీ చేపించిన ఎమ్మెల్యే వర్గీయులుసమాజంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటదని బలవంతంగా అడ్డుకోవటం దౌర్జన్యం చేయటం ప్రజాస్వామ్యంలో పద్దతి కాదంటున్న ప్రజాసంఘాలు , రాజికీయ విశ్లేషకులు.*అనంతపురం జిల్లాహిందూపురంలో IT దాడులుపలు ఇండస్ట్రీస్ పై IT దాడులువిలువైన డాక్యుమెంట్లు,బంగారం, స్వాధీనం.ఇంక దాడులుజరిగే అవకాశంమరింత సమాచారం తెలియాల్సి ఉంది.
*ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని తైవాన్ నగరంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. తైవాన్ నగర సమీపంలోని ఫర్ఖార్ కు 17 కిలోమీటర్ల దూరంలోని హిందు కుష్ ప్రాంతంలో గురువారం ఉదయం 6.15 గంటలకు భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. 222.1 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ భూకంపంతో ఇళ్లలోని జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎంత ఆస్తినష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు.
*మహారాష్ట్రలో వరద తీవ్రతతో 16 మంది మరణించగా పెద్దసంఖ్యలో ప్రజలు నిర్వాసితులయ్యారు. భారీ వర్షాలతో షోలాపూర్, సంగ్లి, సతారా, కొల్హాపూర్, పూణే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల నుంచి 1,40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆయా జిల్లాల్లో స్కూళ్లు, విసంస్థలు పనిచేయడం లేదు. మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది.
*శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని అందవరం గ్రామం వద్ద వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ మేరకు గొట్ట బ్యారేజ్ వద్ద లక్షా 12 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికంగా ఆయా గ్రామాల్లో విఆర్ఓ లు పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మండల కేంద్రంలోని కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని తహశీల్దార్ బి రామారావు, ఎంపీడీవో తేజ రతన్ కోరారు.
*మొన్నటికి మొన్న ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర జన శక్తి వనరుల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో సమయంతో పాటు, డబ్బు కూడా వృథా అవుతుందని కేంద్రమంత్రి లోక్ సభ వేదికగా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు తాజాగా కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరానికి మళ్లీ బ్రేకులు పడే పరిస్థితి నెలకొంది. పోలవరం నిర్మాణంపై ఏపీ సర్కార్ కు కేంద్రంషోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యవరణ నింబంధనలనుప్రస్తావిస్తూ దానిపై వివరణ కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో ఏపీ సర్కార్ కు వివరణ ఇవ్వాలని పేర్కొంది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది.
*ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మళ్ళీ పెరుగుతున్న వరద ఉధృతి 12.40 అడుగులకు చేరుకున్న నీటిమట్టంధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 10 లక్షల 80 వేల క్యూసెక్కులకు పెరిగిన డిశ్ఛార్జి అర్థరాత్రి తర్వాత మళ్ళీ రెండో ప్రమాద స్థాయికి వరదఎగువ పరివాహాక ప్రాంతంలో పెరుగుతున్న వరద గోదావరి నీటిమట్టాలుభద్రాచలం వద్ద 42.50 అడుగులకు చేరిన నీటిమట్టం మరికొద్దిసేపట్లో భద్రాచలం వద్ద మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక కూనవరంలో 17.93 మీటర్లు , శబరి కుంట వద్ద 14.30 మీటర్లు, శబరి తాళ్ళగూడెం వద్ద 13.77 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం తో పెరుగుతున్న వరదదేవీపట్నం మండలంలో 8వ రోజు వరద ముంపులో కొనసాగుతున్న పలు లంక గ్రామాలు మళ్ళీ ముంపు గ్రామాల్లో ఇళ్ళలోకి చేరుతున్న వరదభయంగుప్పిట్లో మళ్ళీ ముంపు గ్రామాల ప్రజలు.
*నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లుకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాష్ట్రశాఖ ప్రకటించింది. ఐఎంఏ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీహరిరావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఫణీంద్ర, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధరరావు వెల్లడించారు.
*రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది..ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.50 అడుగులు ఎత్తులో ధవళేశ్వరం బేరేజీ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది.. ప్రస్తుతం 11.73 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు..భద్రాచలం వద్ద 43.2 అడుగులకు చేరిన వరద గోదావరి నీటిమట్టం..
*మహారాష్ట్రాలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తి నదులు, వాగులు పొంగిప్రవహిస్తుండటంతో పూణే మార్గంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. భిల్వాడి రైల్వేస్టేషను సమీపంలోని నదిలో ప్రమాదకరస్థాయిలో వరదనీరు ప్రవహిస్తుండటంతో పూణే-మిరాజ్ సెక్షన్ లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. పూణేతోపాటు సతారా, సాంగ్లి, షోలాపూర్, కొల్హాపూర్ జిల్లాల్లో వరదలు పోటెత్తడంతో 16 మంది మరణించారు. లోతట్టుప్రాంతాలు జలమయం కావడంతో 28,397 కుటుంబాలకు చెందిన 1,32,360 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సహాయ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పించారు.
*కృష్ణ, గోదావరి నదులకు వరద ఉద్ధృతి పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటకలలో నదులకు భారీగా వరద ఉండటంతో దిగువకు నీటి విడుదల అధికమైంది. కృష్ణాలో నారాయణపూర్ నుంచి బుధవారం ఉదయం 3.93 లక్షల క్యూసెక్కుల నీటిని జూరాలకు విడుదల చేయగా, సాయంత్రం ఆరు గంటలకు 4.65 లక్షల క్యూసెక్కులకు పెరిగింది.
*కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడితేనే ఓబీసీల హక్కులు తిరిగొస్తాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని సరూర్నగర్ మైదానంలో ఓబీసీ నాలుగో జాతీయ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
*వారసత్వ కట్టడాల పరిరక్షణ వ్యవహారంలో ప్రభుత్వ వాదనకు.. వాస్తవాలకు పొంతన ఉండటంలేదని బుధవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఐదు మాస్టర్ ప్లాన్లు అమల్లో ఉన్నాయంటున్న ప్రభుత్వం మొదటి మాస్టర్ ప్లాన్లో గుర్తించిన వారసత్వ కట్టడాలకు రక్షణ ఉంటుండగా రెండో ప్లాన్లో లేదని ఎలా చెబుతుందని ప్రశ్నించింది.
* కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆమెను కలిసిన ప్రతిసారీ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అందరితో అభిమానం ప్రదర్శిస్తూ స్వాగతం పలికేవారు. ఆమె విలువలకు మారుపేరైన గొప్ప నేత. ప్రపంచంలో భారతీయులు ఏ ఆపదలో ఉన్నా కూడా సాయం చేయాలని కోరితే ఒక్క ట్వీట్తో తాను ఉన్నాననే భరోసా కల్పించేవారు.
*రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్-1, 2 తదితర ఉద్యోగ ప్రకటనలు నిలిచిపోయాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజన, సర్వీసు నిబంధనలు రూపొందించడంలో జాప్యంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
*తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ పూర్తి స్థాయి బడ్జెట్పై కసరత్తు వేగవంతం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఓట్ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు ఓట్ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించింది. గతనెల కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చింది.
*తెలంగాణ సచివాలయం నుంచి శాఖల తరలింపు వేగవంతమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఆయన పేషీలు బేగంపేటలోని మెట్రోరైల్ భవన్కు తరలించనున్నారు.
*జిల్లా పరిషత్లకు పూర్వ వైభవం తెస్తామని సర్కారు చెబుతుంటే.. పంచాయతీరాజ్ శాఖ మాత్రం దిగువస్థాయి సిబ్బంది పనులనూ జడ్పీ సీఈవోలకు అప్పగిస్తూ కొత్త పోకడలకు తెరతీస్తోంది. సిబ్బందికి జీతభత్యాల చెల్లింపులు సహా జిల్లా పరిషత్ల ఆర్థిక పరమైన అంశాలను పర్యవేక్షించే అధికారాలను తాజాగా సీఈవోలకు కట్టబెట్టింది.
*రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్లో కన్వీనర్ కోటా కింద 23,688 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 9 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా బుధవారం నాటికి 14,369 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
*డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు శుక్రవారం(ఈ నెల 9వ తేదీ) నుంచి మరోసారి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులతో బుధవారం వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మరోసారి దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశించారు.
*హైదరాబాద్-దిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్లో వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసింది. బోగీల్లో లైటింగ్, ఏసీ సదుపాయాలకు కావాల్సిన విద్యుదుత్పత్తికి హెడ్ ఆన్ జనరేషన్(హెచ్ఓజీ) వ్యవస్థను బుధవారం నుంచి ప్రవేశపెట్టింది.
*ఏపీలో పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రభుత్వం 9వ తేదీన సదస్సును నిర్వహిస్తోంది. విజయవాడలో జరిగే ఈ సదస్సుకు 35 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రధానంగా కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలెండ్, బల్గేరియా, బంగ్లాదేశ్, బ్రిటన్, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, అంగోలా తదితర దేశాల నుంచి ప్రతినిధులు విచ్చేస్తారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొందరు ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర పారిశ్రామిక విధానం గురించి ప్రతినిధులకు వివరించటమే సదస్సు లక్ష్యం.
*గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 10న జరగనున్న 39వ వ్యవస్థాపక దినోత్సవానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్నారని వీసీ కె.శివరామకృష్ణ తెలిపారు. ఆ రోజు గీతం ‘ఫౌండేషన్’ అవార్డు స్వీకరించి స్మారకోపన్యాసం చేస్తారన్నారు.
*తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీతాలు బుధవారం సాయంత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. జీతభత్యాల కోసం కార్మికులు తొలిసారి వారంరోజులపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆరో తేదీ గడిచినా చెల్లించలేకపోవడం ఇదే తొలిసారి. జులై నెల ఆదాయం గణనీయంగా తగ్గటంతో ఈ పరిస్థితి నెలకొంది.
*జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు అంగన్వాడీ కేంద్రాల్లో నెలకోసారి రాత్రి పూట బసచేసి సమస్యలను తెలుసుకోవాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఆదేశించారు. అధికారులు కార్యాలయాలకు పరిమితం కారాదని, వారానికోసారి ఈ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు.
*రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకూ ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితాలో వివరాలను ఓటర్లు కూడా స్వయంగా తనిఖీ చేసుకుని బూత్ స్థాయి అధికారులకు తెలపాలని సూచించారు.
*కృష్ణా జిల్లాలో రానున్న క్షిపణి పరీక్ష కేంద్రానికి తుది అనుమతులు వచ్చేశాయి. రూ.1,200 కోట్ల ప్రాజెక్టుకు కీలకమైన రెండోదశ అనుమతిని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తాజాగా మంజూరు చేయడంతో ఈ కేంద్రానికి అడ్డంకులన్నీ తొలగినట్లయింది.
రాజక్క స్థానంలో పద్మక్క-45 తాజావార్తలు–08/08
Related tags :