ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అమెరికా పర్యటనకు ఇటు రాష్ట్రంలోనూ అటు అమెరికాలోను ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 17వ తేదీన జగన్ ప్రవాస తెలుగువారితో సమావేశం నిర్వహించడానికి డల్లాస్‌లోని కే బేయిలీ కన్వెన్షన్ సెంటరులో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుండి 8 నుండి 10,000 వరకు ప్రవాస తెలుగువారు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహించే జగన్ భేటీకి ప్రవాస తెలుగు సంఘాలతో పాటు భారతీయ సంఘాలకు ఆహ్వానాలు పంపించారు. దీనికంటే ముందు పలువురు ప్రవాస తెలుగు ప్రముఖులతో జగన్ భేటీ అయ్యే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. లాస్ఏంజిల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డా.ప్రేమసాగరరెడ్డి ఈ సమావేశం నిర్వహించడానికి చొరవ చూపుతున్నారు. డల్లాస్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో 150 మంది ప్రవాస తెలుగు ప్రముఖులతో జగన్ అరగంట పాటు భేటీ అవుతారని…రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వారిని ఆహ్వానిస్తారని సమాచారం. డా. ప్రేమసాగరరెడ్డి ఇప్పటికే పలువురు ప్రవాస ప్రముఖులకు ఈ భేటీకి సంబంధించి ఆహ్వానం పంపినట్లు తెలిసింది.
ప్రవాస తెలుగు ప్రముఖులతో భేటి కానున్న జగన్
Related tags :