బందరు పోర్టు పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బందరు పోర్టు అభివఅద్ధి ఒప్పందాన్ని రద్దు ఎపి సర్కార్ రద్దు చేసింది. బందరు పోర్టు నిర్మాణం, అభివఅద్ధి కోసం 2010 జూన్ 7 వ తేదీన అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. డెవలపరుకు ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో, బందరు పోర్టు నిర్మాణానికి ఎపి ప్రభుత్వం కొత్త ఒప్పందం చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలతోనే బందరు పోర్టు నిర్మాణం చేసే యోచనలో ఎపి సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ పోర్ట్ ట్రస్టు ద్వారా బందరు పోర్టు నిర్మాణం, నిర్వాహణ చేపట్టాలని ఎపి సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్ధలతో కన్సార్షియం ఏర్పాటుకు వైఎస్ జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది.
బందరు పోర్టు టెండర్ రద్దు చేసిన ఏపీ సర్కార్
Related tags :