WorldWonders

మూర్ఖుడు ₹35లక్షలు గంగలో కలిపాడు

A fool from haryana dumps his BMW in river for a Jaguar-మూర్ఖుడు ₹35లక్షలు గంగలో కలిపాడు

ఒక్కోసారి కొందరు ఆవేశంలో చేసిన పనులు చాలా తెలివి తక్కువగా అనిపిస్తాయి. హరియాణాలో ఓ యువకుడు చేసిన పని అలాగే ఉంది. నచ్చిన బ్రాండ్‌ కారు కొనివ్వలేదని కొత్త కారును నదిలోకి తోసేశాడు. అది కూడా చిన్నా చితకా కారు కాదు.. ఏకంగా రూ. 35లక్షల పైన విలువజేసే బీఎండబ్ల్యూ కారు. వివరాల్లోకి వెళితే. హరియాణాలోని యమునానగర్‌కు చెందిన భూస్వామి కుమారుడు తనకు జాగ్వర్‌ కారు కొనివ్వమని తల్లిదండ్రులను అడిగాడు. అయితే ఆ భూస్వామి జాగ్వర్‌ మోడల్‌ కాకుండా బీఎండబ్ల్యూ కారును తన కొడుక్కి బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు తన కోపాన్ని కొత్తకారుపై ప్రదర్శించాడు. వెంటనే కారును తీసుకెళ్లి సమీపంలోని నదిలోకి తీసేశాడు. దీంతో కారు నది మధ్యలో చిక్కుకుపోయింది. అయితే కాసేపటికి చేసిన తప్పు తెలుసుకుని కారును బయటకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. తన వల్ల కాకపోవడంతో స్థానిక గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు తెచ్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో వ్యవహారం పోలీసులకు తెలిసింది. దీంతో వారు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.