NRI-NRT

హైదరాబాద్‌లో యాపిల్ మాజీ సిఈవో-ఐకా రవి, గుత్తికొండలతో భేటి

Apple Ex CEO John Sculley Meets Telugu NRIs Aikaa Ravi & Guthikonda In Hyderabad-హైదరాబాద్‌లో యాపిల్ మాజీ సిఈవో-ఐకా రవి, గుత్తికొండలతో భేటి

యాపిల్ సంస్థ మాజీ సీఈవో, పెప్సీ సంస్థ మాజీ అధ్యక్షుడు జాన్ స్కల్లీ(John Sculley) ప్రస్తుతం హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ప్రముఖ ప్రవాసాంధ్రులు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌లు ఏర్పాటు చేసిన RxAdvance కంపెనీకి ప్రస్తుతం జాన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు,. శనివారం నాడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఈ కంపెనీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి స్కల్లీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కంపెనీ కొత్త ప్రోడక్ట్‌ను విడుదల చేశారు. స్కల్లీతో భేటీ అయినవారిలో బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు వల్లేపల్లి శశికాంత్ కూడా ఉన్నారు.