1.ఆగస్టు నెల రాశి ఫలితాలు – తదితర ఆద్యాత్మిక వార్తలు – 08/10
2. శారదాంబకు స్వర్ణశోభ
శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హైదరాబాద్ నల్లకుంట శృంగేరీ శంకరమఠంలోని శ్రీశారదాంబ అమ్మవారికి భక్తులు శుక్రవారం ఏడు కిలోల బంగారు చీరను కానుకగా అందజేశారు. శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థస్వామి అనుగ్రహంతో భక్తులు ఈ కానుకను సమర్పించినట్లు శృంగేరీ శంకరమఠం నల్లకుంట శాఖాధిపతి కృష్ణారావు తెలిపారు. బంగారు చీరతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
3. శ్రీవారికి రూ.14 కోట్ల విరాళం-అందజేసిన ప్రవాస భారతీయులు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఇద్దరు ప్రవాస భారతీయులు రూ.14 కోట్ల విరాళాన్ని సమర్పించారు. అమెరికాలో స్థిరపడ్డ దాతలు గురువారం తిరుమలకు చేరుకొని.. ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి విరాళం అందజేతపై చర్చించారు. శుక్రవారం ఉదయం దాతలు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నాక.. రంగనాయకుల మండపంలో రూ.14 కోట్ల విరాళానికి సంబంధించిన డీడీలను ధర్మారెడ్డికి అందజేశారు. తితిదేకు చెందిన వివిధ ట్రస్టుల కింద విరాళం మొత్తాన్ని డిపాజిట్ చేయాలని సూచించారు. తమ పేర్లు, చిరునామా వివరాలను వెల్లడించవద్దంటూ దాతలు విన్నవించారు. ఇంతపెద్ద మొత్తంలో విరాళం అందడం ఇటీవల రికార్డు అని అధికారులు పేర్కొన్నారు.
చెన్నై భక్తుడు రూ.కోటి..
* తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన భక్తుడు బాలాజీ ప్రసాద్ రూ.కోటి విరాళాన్ని సమర్పించారు. ఛార్టర్డ్ అకౌంటెంట్గా అబూదాబిలో స్థిరపడిన ఆయన విరాళానికి సంబంధించిన డీడీలను చెన్నైలోని తితిదే సమాచార కేంద్రంలో అందజేశారు. విరాళం మొత్తాన్ని వేదపరిరక్షణ ట్రస్టు కింద జమ చేయాలని దాత సూచించారు.
4. వరములీయమ్మా వరలక్ష్మి
శ్రావణ శుక్రవారం సందర్భంగా భద్రాద్రి రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కనులపండువగా సాగింది. రామాలయంలో స్వర్ణాలంకృతులైన మూలమూర్తులకు అర్చకులు సుప్రభాతం నిర్వహించి నామార్చనలు చేసి ఆరాధించారు. అమ్మవారికి వ్రత పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వ్రతం ఆచరించేందుకు వచ్చిన మహిళలకు పసుపు, కుంకుమ, అమ్మవారి చిత్రపటం, పూజా సామగ్రి ఉచితంగా అందించారు. శనివారం నుంచి 15 వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాల కారణంగా రామయ్యకు నిత్య కల్యాణాన్ని నిలిపేశారు.
5. నేడు దిల్లీలో మల్లికార్జునస్వామి కల్యాణం
శ్రీశైల శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాన్ని దిల్లీ గోల్మార్కెట్లోని తితిదే బాలాజీ మందిర్లో శనివారం నిర్వహించనున్నట్లు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం ఏడు గంటలకు కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
6. తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ
ఈరోజు శనివారం 10-08-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ……
శ్రీవారి దర్శనానికి 21 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు…..
శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది….
నిన్న ఆగస్టు 9 న 68,681 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 3.39 కోట్లు.
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండిhttps://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
7. పంచాంగం 10.08.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: శ్రావణ
పక్షం: శుక్ల
తిథి: దశమి ప.01:31 వరకు
తదుపరి ఏకాదశి
వారం: శనివారం (మంద వాసరే)
నక్షత్రం: జ్యేష్ఠ రా.02:36 వరకు
తదుపరి మూల
యోగం: ఇంద్ర, వైధృతి
కరణం: గరజ
వర్జ్యం: ఉ.08:03 – 09:40
దుర్ముహూర్తం: 05:57 – 07:33
రాహు కాలం: 09:09 – 10:45
గుళిక కా: 05:57 – 07:33
యమ గండం: 01:57 – 03:33
అభిజిత్ : 11:56 – 12:46
అమృత కాలం: 01:53 – 03:33
సూర్యోదయం: 05:57
సూర్యాస్తమయం: 06:45
వైదిక సూర్యోదయం: 06:01
వైదిక సూర్యాస్తమయం: 06:41
చంద్రోదయం: 02:45
చంద్రాస్తమయం: 01:24
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దిశ శూల: తూర్పు
నక్షత్ర శూల: తూర్పు
చంద్ర నివాసం: ఉత్తరం
శ్రీవేంకటేశ్వర వ్రతం
8. వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాలు నేటి నుంచి
ఆగిరిపల్లిలో వేం చేసిన శ్రీశోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జోగి రాంబాబు, ఆలయ అర్చకుడు వేదాంతం శేషుబాబు తెలిపారు. 10న సుప్రభాత సేవతో పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతాయి. 11న శాంతి హోమం, 12న హోమం, 13న మహాపూర్ణాహుతి, శాంతి కల్యాణం, గరుడోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని వారు కోరారు.
9. ఆగస్టు 13, 27న వృద్ధులు, దివ్యాంగులకు, ఆగస్టు 14, 28వ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు
శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులోభాగంగా ఆగస్టు 13, 27వ తేదీల్లో మంగళవారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఆగస్టు 14, 28వ తేదీల్లో బుధవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
ఆగస్టు నెల రాశి ఫలితాలు
Related tags :