విదేశాల్లో ఉంటున్న భారతీయులకు ఆధార్ కార్డు పొందడానికి ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రవాస భారతీయులు కనీసం 180 రోజులు స్వదేశంలో ఉంటేనే ఆధార్ అనే నిబంధన గతంలో అమలయ్యేది. అయితే, విదేశాల్లోని కంపెనీల్లో సెలవులు దొరకకపోవడం, తక్కువ కాలమే స్వగ్రామాల్లో ఉండే పరిస్థితి ఏర్పడటంతో ఆధార్ కార్డు కోసం ఈ నిబంధన సవరించాలని ప్రవాస భారతీయులు అనేక మార్లు ప్రభుత్వాన్ని కోరారు. మన దేశంలో ప్రతి పనికి ఆధార్‌తో లింకు పెట్టడంతో ఆధార్ కార్డు అవసరం తప్పనిసరైంది. ప్రవాసులకు మాత్రం ఆధార్ కార్డు జారీ కావాలంటే స్వదేశంలో కనీసం 180 రోజులు ఉండాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన సవరించాలనే డిమాండ్ ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే, ఆధార్ నిబంధనలను సవరించిన ఆంశంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది.
ఎన్నారైలకు ఆధార్ కష్టాలు ఉండవు
Related tags :