క్రికెట్ లా మేకర్ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిర్వహించే సమావేశానికి అందులో సభ్యుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దూరం కానున్నాడు. ఆగస్టు 11, 12వ తేదీల్లో మైక్ గాటింగ్ అధ్యక్షతను జరుగనున్న సమావేశానికి తాను రావడం లేదని గంగూలీ స్పష్టం చేశాడు. తన తల్లికి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి ఉందని, దాంతో తాను మీటింగ్‌కు రావడం లేదని గంగూలీ తెలియజేశాడు. క్రికెట్‌లో ఏమైనా వివాదాలు తలెత్తితే ఎంసీసీ మీటింగ్‌లో సమీక్షిస్తారు. ఒకవేళ మార్పులు అనివార్యమైన పక్షంలో ఏమి చేస్తే బాగుంటుందనేది ఎంసీసీ సూచిస్తుంది. ఏడాదికి రెండుసార్లు ఎంసీసీ సమావేశం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆది, సోమ వారాల్లో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధంచి మీడియాతో మాట్లాడిన గంగూలీ.. ఎంసీసీ మీటింగ్‌లో పాల్గొనడం లేదని పేర్కొన్నాడు. ఇక భారత క్రికెటర్లను నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) పరిధిలోకి తీసుకురావడంపై గంగూలీ స్పందించలేదు.
నేను రాను పొండి
Related tags :