* ప్రేమ కథలు అనేకం.. కొన్ని దరి చేరినవి.. మరికొన్ని దరి చేరనివి.. మనసుకు ఒకరికొకరు నచ్చేలా కానీ ప్రేమకు కులం మతం అనేవి అడ్డుకాదు. ఎన్ని ముంతాజ్-షాజాహాన్ పారు, దేవదాస్ లైలా మజ్ను ఇలా చాలా ప్రేమల గురించి మనకు తెలుసు. అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోయేప్రేమకథ మాత్రం వీటిన్నంటి కంటే ప్రత్యేకమైనది. ఇది ఓ రౌడీకి, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య చిగురించిన ప్రేమ కథ. ప్రస్తుతం వీరి ప్రేమ కథ గురించే నోయిడాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రౌడీ షీటర్ రాహుల్ థార్సనా పలు హత్య కేసులలో నిందితులు. 2014లో మన్మోహన్ గోయల్ అనే వ్యాపారిని హత్య చేసిన కేసులో మే 9వ తేదీన అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు విచారణలో భాగంగా సూర్జాపూర్ కోర్టుకు పోలీసులు అతడిని తీసుకొచ్చేవారు.కోర్టులో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ పాయల్ రాహుల్‌ను చూసి ప్రేమలో పడిపోయింది. ఇలా తరుచూ రాహుల్ కోర్టుకు వచ్చినప్పుడల్లా అతనితో పాయల్ మాట్లాడుతుండేది. ఇలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రాహుల్ బెయిల్‌పై విడుదలైన తర్వాత వారి బంధం మరింతగా బలపడింది. ఐదు సంవత్సరాలుగా వీరి ప్రేమ కథ పెళ్లి పీటలు ఎక్కింది. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పాయల్‌ను పెళ్లి చేసుకున్నట్లు రుజువైతే ఆమెపై చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.
* తల్లి వివాహేతర సంబంధం జీర్ణించుకోలేని ఓ కొడుకు.. తల్లిని అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రెట్టగుంట దళితవాడలో చోటు చేసుకుంది.తన తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకున్న కుమారుడు ప్రేమ్ కుమార్.. పలు సార్లు తల్లిని మందలించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొడుకు దౌర్జన్యాలను తట్టుకోలేని తల్లి జ్యోతి.. కుమారుడిపై గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రేమ్‌కుమార్‌ను మందలించి పంపారు. దీంతో తల్లిపై కోపంతో ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. మళ్లీ కాసేపటికి తిరిగి వచ్చిన అతడు.. తల్లి వేరే వ్యక్తితో ఉండడాన్ని సహించలేక కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అడ్డొచ్చిన సౌందర్‌రాజన్ అనే వ్యక్తిపై కూడా ప్రేమ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*టాంజానియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టాంజానియా రాజధాని దార్ ఎస్ సలామ్‌కు పశ్చిమంగా వున్న మొరగొరోలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 62 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 70 మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ట్యాంకర్ నుంచి స్థానికులు పెట్రోల్ తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్నవారు మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేశారు.
* వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో ఏడుకొండలు (35) అనే వ్యక్తిని నాగయ్య అనే మరోవ్యక్తి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం భారీగా పట్టుబడింది. నిన్న రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు 9.2 కిలోల బంగారంను గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.3.46 కోట్లుగా సమాచారం. వీ ఆకారంలో నాలుగు కడ్డీలను ఇస్త్రీ పెట్టెలో తీసుకొస్తుండగా పట్టుకున్నారు.
* ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పేకాట స్థావరంపై ఎస్సై షేక్.సమందర్ వలి మరియు వారి సిబ్బంది దాడి ఈ దాడిలో 6 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 18080/- స్వాధీనం చేసుకున్న ఎస్సై సమందర్ వలి.
* యమునానగర్లో ఖరీదైన కార్ల మోజులో ఓ యువకుడు చేసిన పని అందరినీ నివ్వెరపరిచింది. పెద్ద కారు కావాలంటూ రూ.60 లక్షలు పెట్టి కొన్న బీఎండబ్ల్యూ కారును కాలువలో పడేశాడు. ఐదు గంటలు శ్రమించి కారును బయటకు తీశారు పోలీసులు.
* మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడడంతో 22 మంది మృతి చెందారు. మయాన్మార్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో మట్టిలో 16 గృహాలు కూరకపోయాయి. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి జెసిబిల సహాయంలో కొండచరియల కింద ఉన్న 22 మృతదేహాలను బయటకు తీశారు. యపడిన 47 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కొన్ని కుటుంబాలే గల్లంతయ్యాయని స్థానిక ప్రజలు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
89000 మంది సహాయక కేంద్రాలలో తలదాచుకున్నారు.
* నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని ఓ పెట్రోలు బాంక్ సమీపంలో మతిస్థిమితం లేని మహిళను ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. గతంలో కుడా ఈ డ్రైవర్ సైదాపురం మండలం చాగణం వద్ద పాఠశాలకు వెళుతున్న బాలుడుని అతి వేగంగా ఢీకొట్టడంతో బాలుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అంతే కాకుండా వాహనాన్ని అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగింది.
* బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో అక్రమ సంబంధం నేపథ్యంలో అంకే కొండలు (34)హత్య కు గురయ్యాడు హాత్యా కిరాతకంగా జరిగింది. తలను నరికి మెండెం వేరు చేసారు మృతుడి భార్య తో అక్రమ సంభందం నేపథ్యం లో హాత్యా జరిగినట్లు సమచారం హత్య చేసినా పాలo నాగయ్య అనే వ్యక్తి బోల్లాపల్లి పోలీస్ స్టేషన్ లో లోంగిపోగా సంఘటన స్థలన్నీ పరిశీలించి వివరాలు సేకరిస్తున్న పోలీసులుహత్యకు గురి అయిన అంకే కోండలు(34)భార్య తో హత్య చేసింది నేనే అనీ స్టేషన్ లో లోంగి పోయిన పాలం నాగయ్య కి అక్రమ సంభందం ఉన్నట్లు సమచారం.
*ఏపీలోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని ఓ కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
*మామిడాకులు తెంపుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
*గుజరాత్లోని ఖేడా జిల్లాలోని నడియాడ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నడియాడ్లోని ప్రగతినగర్లో శుక్రవారం అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే మృతుల సంఖ్యపై ఎలాంటి సమాచారం లేదు.
*ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కరీంనగర్కు చెందిన ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
*జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ టెక్ జోన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసునిందితుల్లో ఒకరైన నిమ్మగడ్డ ప్రసాద్కు ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు వారెంట్ జారీ చేసింది.
*నగదు అక్రమ చెలామణి కేసులో అరెస్టయిన హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్బాబును దిల్లీ కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ నెల 23వ తేదీ వరకూ సతీష్బాబును జైలుకు పంపుతూ ప్రత్యేక జడ్జి కిరణ్ బన్సాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సతీష్ను తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన సీబీఐ 14 రోజుల గడువు ముగియటంతో శుక్రవారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది.
*ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్పై దిల్లీ కోర్టు శుక్రవారం అభియోగాలను నమోదు చేసింది. బాలికను కిడ్నాప్ చేశారనే అభియోగాలు ఎమ్మెల్యే అనుచరుడు శశిసింగ్పై నమోదయ్యాయి.
* ఉన్నావ్ బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, ఆయన సోదరుడు కలసి దాడి చేశారని సీబీఐ గురువారం దిల్లీ కోర్టుకు తెలిపింది. పోలీసులతో కుమ్మక్కై బాధితురాలి తండ్రిపై అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే అభియోగాన్ని మోపి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
* స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఛైర్మన్ అనిల్కుమార్ చౌదరిపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని దక్షిణ దిల్లీ లోని తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు హడ్కో దగ్గర ఆయన కారును ఢీకొట్టి అటకాయించారు.
*దుబాయి తదితర దేశాలకు పంపిస్తానని నకిలీ పత్రాలతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ గల్ఫ్ ఏజెంటుపై పోలీసులు రాష్ట్రంలోనే తొలిసారిగా పీడీ చట్టం ప్రయోగించిన సంఘటన ఇది. దీనికి సంబంధించి జగిత్యాల ఎస్పీ సింధుశర్మ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎకీన్పూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ కనుకుంట్ల వెంకటేశ్(40) గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్నాళ్లు ప్రైవేటు పాఠశాల నిర్వహించాడు.
*ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ యువతుల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. పేదరికం, అమాయకత్వమే ఆసరాగా దళారులు గిరిజన యువతులను రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల వ్యక్తులకు అమ్మేస్తున్నారు.
*మోటారు వాహనాలు, అగ్నిప్రమాదాలు, నౌకాయానం, ఇతర క్లెయిమ్ పరిష్కారాల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ..సికింద్రాబాద్లోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులకు కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ మేరకు గురువారం సీబీఐ మూడో అదనపు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
*వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి బిస్కెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో జరిగింది.
*కాలిఫోర్నియాలోని గార్డెన్ గ్రోవ్ పట్టణానికి చెందిన 33 ఏళ్ల దోపిడీ దొంగ గురువారం విధ్వంసం సృష్టించాడు. ఆరుగురిని కత్తితో పొడిచాడు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అతడిని పట్టుకున్నారు.
*గాంధీ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం మూడో అంతస్తులోని యూనిట్ లో ప్రమాదం జరిగింది. వార్డుకు తాళం వేసి ఉండడం, పక్కనే పీడియాట్రిక్ సర్జరీ వార్డులోనూ పిల్లలెవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
*నులిపురుగు మాత్ర వేసుకున్న వెంటనే అస్వస్థతకు గురై రెండేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
*గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్య, మిర్యాలగూడలోని దళిత యువకుడు ప్రణయ్ హత్యలతో పాటు పలు కేసుల్లో ప్రధాన నిందితుడైన కరడుగట్టిన ఉగ్రవాది అస్గర్ అలీ జైలుకు వెళ్లినా అతడి తీరు మారలేదని తెలుస్తోంది.
*తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం కేసులో కామోన్మాది ప్రవీణ్కు ఉరిశిక్ష పడింది. ఘటన జరిగిన 2 నెలల లోపే విచారణ పూర్తై తీర్పు వెలువడింది.
రౌడీ వలలో లేడీ పోలీస్-నేరవార్తలు–08/10
Related tags :