‘డార్లింగ్’ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇది. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు సుజీత్ పూర్తి యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు.ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ బాణీలు అందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాహో ట్రైలెర్ వీడియో

Related tags :