Movies

సీక్రెట్ పవర్స్

Sonakshi Hits Akshay Kumar And He Falls Off-సీక్రెట్ పవర్స్

సినిమా షూటింగుల్లో అందరితో సరదాగా ఉంటూ.. తనదైన శైలిలో తోటి నటులను ఆటపట్టించే నైజం అక్షయ్‌కుమార్‌ది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా తోటి నటి పన్నిన సరదా పన్నాగంలో అక్షయ్‌ పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అక్షయ్‌ కుమార్‌, సోనాక్షి సిన్హా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఓ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో ప్రముఖ హీరోయిన్లు నిత్యామేనన్‌, తాప్సి, విద్యాబాలన్‌, కీర్తి కుల్హరి పాల్గొన్నారు. వీరంతా కూర్చొని చిత్రానికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు .ఈ క్రమంలో అక్షయ్‌ మాట్లాడుతూ.. కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. పక్కనే ఉన్న సోనాక్షి.. దీన్ని అదునుగా భావించి అక్షయ్‌ ఛాతిపై చేత్తో కొట్టింది. దీంతో అక్షయ్‌ కుర్చీతో పాటు వెనక్కి పడిపోయాడు. అతను పడిపోతుండగా తాప్సి పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్షయ్‌ని చూసి అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురవగా.. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ‘‘నాకు ఎవరైనా చిరాకు తెప్పిస్తే నేను ఇలాగే ప్రవర్తిస్తాను’’ అని నవ్వూతూ వివరణ కూడా ఇచ్చింది. అక్షయ్‌ సైతం దీన్ని సరదాగా తీసుకొని సోనాక్షి వైపు చేయి చూపుతూ ఏంటిది? అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్‌ పెట్టడంతో మిగతావారూ నవ్వడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘అప్పుడు వారందరి ముఖాలు చూడాల్సింది’ అనే ట్యాగ్‌లైన్‌తో సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.