Movies

తాప్సీకి తిక్కరేగిందిరోయి

Tapsee gets mad at kanganas sister and manager rangoli-తాప్సీకి తిక్కరేగిందిరోయి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ గతంలో తన గురించి చేసిన వ్యాఖ్యలకు కథానాయిక తాప్సీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కంగన నటించిన `జడ్జ్మెంటల్ హై క్యా’ సినిమా ట్రైలర్ను ఇటీవల తాప్సీ ప్రశంసించింది. అయితే ఆ ప్రశంసకు రోంగోలీ స్పందిస్తూ.. ‘కంగనను ప్రశంసించరు.. కానీ ఆమెను కాపీ కొడతార’ని తాప్సీని విమర్శించింది.తాజాగా `మిషన్ మంగళ్` సినిమా ప్రమోషన్లో రంగోలి వ్యాఖ్యలపై తాప్సీ ఘాటుగా స్పందించింది. `నన్ను ‘సస్తా’(చౌక) అని అన్నారు. అవును నేను చాలా తక్కువ పారితోషికమే తీసుకుంటాను. అందువల్ల మీరు నన్ను అలా అనొచ్చు. నేను కాపీ నటిని అని కూడా అన్నారు. కంగన మంచి నటి కాబట్టి మీ విమర్శను నేను పొగడ్తగానే తీసుకుంటాను. నాకు, కంగనకు ఉంగరాల జుట్టు ఉంది. నేను ఉంగారాల జుట్టుతోనే జన్మించాను. అది నాకు వారసత్వంగా వచ్చింది. కంగన ఉంగరాల జుట్టుపై పేటెంట్ హక్కులు తీసుకున్నారని నాకు తెలీదు. ఇది కాక మరే విషయాల్లో నేను కంగనను కాపీ చేశానో నాకు అర్థం కావడం లేద`ని తాప్సీ వ్యాఖ్యానించింది.