DailyDose

క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్లు-తాజావార్తలు–08/10

Transgenders Into Cricket-Daily Breaking News-Aug102019-క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్లు-తాజావార్తలు–08/10

* ఇనాళ్ళూ క్రీడల్లో వివక్ష ధోరణులను చూశాం. కానీ ఇప్పుడు ఆ వివక్షలను రూపుమాపేలా ఓ వినూత్న ఆలోచనకు తెర లేపింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. క్రికెట్‌లో ఇనాళ్ళు మెన్, ఉమెన్స్‌ను మాత్రమే చూశాం. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా లింగ వివక్షకు అవకాశం లేకుండా ఇక నుంచి ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌లో అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. ట్రాన్స్‌జెండర్లను కూడా జట్టులో ఆడించాలని అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. #ASportForAll అనే హ్యాష్‌టాగ్‌ను జతచేసింది. క్రీడల్లో లింగ సమానత్వాన్ని పెంపోదించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ నిర్ణయంపై అభిప్రాయాలు తెలపాలని క్రికెట్‌ అభిమానులను క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరింది. ఈ నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం పట్ల అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్రాన్స్‌జెండర్లను ఆడించాలన్న నిర్ణయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాలి.
* శ్రీశైలం డ్యామ్‌ గేట్లు తెరుచుకున్నాయి. వరద పోటెత్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది.. దీంతో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌.. తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి గంగమ్మకు పూజలు నిర్వహించారు.. అనంతరం గేట్లను తెరిచారు.. దీంతో కృష్ణమ్మ పరుగులు పెడుతూ సాగర్‌ వైపు కదులుతోంది.. మొదట 6వ నెంబర్‌ గేటను ఎత్తారు. ఆ తర్వాత 7, 8, 9 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.
* నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరై ప్రసంగించారు. తెలంగాణ వికాస సమితి భిన్నాభిప్రాయాలను పంచుకునే వేదిక అని తెలిపారు. భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హైదరాబాద్‌లో స్వేచ్ఛ ఉందన్నారు. పాలనలో ఏమైనా తప్పులున్నా ఎత్తి చూపే స్వేచ్ఛ వికాస సమితికి ఉంది.
* ఇటీవల కాలంలో బోండా ఉమా పార్టీ మారుతున్నారని మీడియాలో కథనాలు.దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి దూతగా బోండా ఉమా తో గంట పాటు చర్చలు జరిపారు, బొండా ఉమా మాట్లాడుతూ … నేను చంద్రబాబునాయుడు గారి తోనే ఉంటానని పార్టీ మారే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు, ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.
* గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి గోపి రాజు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎం ఈశ్వర రావు రమేష్ ఫణి గిరిజన నాయకులు బ్రాహ్మవతు రామదాసు బి తిరుపతి రావు జె దశరధ బి దుర్గ మ తులసి జిల్లా కలెక్టర్ ఎ ఎం ఇంతీయజ్ జాయింట్ కలెక్టర్ మాధవి లత కు శాలువా కప్పి సన్మానించారు
* ఏ కొండూరు మండలంలోని ఉన్న చీమలపాడు పెద్ద తండాకు వాటర్ ట్యాంక్ లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు అని తండాలో ఉన్న రోడ్డు లేక నడవడానికి పనికిరాకుండా పోయాయి అన్నీ చెప్పడం జరిగింది. సమస్యలు పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బి గోపి రాజు కలెక్టర్ గారికి కొరగానే ఏ కొండూరు మండలానికి తండాలో మంచి నీరు అందించేందుకు 9 వాటర్ ప్లాంట్ మంజూరు చేసినట్లు గోపి రాజు తో చేప్పారు.
* ఏపీ ప్రభుత్వం బందరు పోర్టు నిర్మాణ పనుల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పైన జీవోలో సకాలంలో పనులు చేయని కారణంగా రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వమే ఈ పోర్టు నిర్మాణం చేస్తుందని చెబుతోంది.
* కేంద్ర ప్రభుత్వం సాగరమాల కింద ఈ ప్రాజక్టు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వినిపి స్తుంటే..
గుజరాత్ కు చెందిన ఒక సంస్థకు ప్రాజెక్టు నిర్మాణం అప్పగిస్తారని..బీజేపీ నేతల కోరిక మేరకు వారికి అప్పగించనున్నారని చెబుతున్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు జయప్రకాశ్ నారాయణ్ చురకలు
* తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణాతో జేపీకి ఏం సంబంధం .. మొదటి నుండీ జయప్రకాశ్ నారాయణ తెలంగాణా వ్యతిరేకి అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎవరో పిచ్చోడు మాట్లాడితే పట్టించుకోవలసిన అవసరం లేదని కేసీఆర్ పరుషంగా మాట్లాడారు.
* జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేస్తున్న మాజీ ఎంఎల్ఎ రషీద్ ఇంజినీర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం అరెస్ట్ చేసింది. రషీద్ కశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయపడుతున్నట్టు సమాచారం అందడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. 2017వ సంవత్సరంలో రషీద్ కు ఉగ్ర సంబంధాలపై ఎన్ఐఎ అధికారులు ప్రశ్నించారు.జమ్మూకశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంతో పాటు ఆర్టికల్ 370ని రద్దు చేసింది. కాగా, ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులతో సంబంధం ఉన్న మాజీ ఎమ్మెల్యే రషీద్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లో కట్టుదిట్టమైన భారీ భద్రతను మోడీ సర్కార్ ఏర్పాటు చేసింది.
* కేరళలో రోజులు గడుస్తున్నా… పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. భారీ వర్షాలు, వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు లక్ష మంది వరకు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.వయనాడ్, మలప్పురంలోని వరద బాధిత ప్రాంతాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపు సందర్శించనున్నారు.కర్ణాటకలో వరద ప్రభావం కొనసాగుతోంది. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, అగ్నిమాపక దళాలు సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వరదల వల్ల 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించింది ప్రభుత్వం.
పునరుద్ధరణ పనుల కోసం తక్షణమే రూ.100 కోట్లు విడుదల చేసింది.
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన 1.33 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు నిరుద్యోగులు. 1.33 లక్షల ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోయింది దీంతో, ఇప్పటి వరకు 20.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక, 19.34 లక్షల మంది అభ్యర్ధులు పరీక్ష ఫీజులు కూడా చెల్లించారు.
* తిరుపతి అలిపిరిలో జూడాలను కాలితో తన్నిన విజిఒ పై శనివారం వేటుపడింది. అశోక్‌ కుమార్‌ గౌడ్‌ ను విఆర్‌ కి ప్రభుత్వం పంపింది. కొద్ది రోజులుగా ఎన్‌ఎంసి బిల్లును వ్యతిరేకిస్తూ జూడాల నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తిరుపతిలోని అలిపిరిలో జూడాలు నిరసన చేస్తుండగా, విజిఒ దురుసుగా ప్రవర్తించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ జూడాలు విజిఒను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.
* నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం ప్రస్తుతం సాగర్.. ఇన్‌ఫ్లో-2.35 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో-6వేల క్యూసెక్కులు ర్తిస్థాయి నీటినిల్వ-312 టీఎంసీలు కlప్రస్తుతం నీటి నిల్వ -150 టీఎంసీ పూర్తిస్థాయి నీటిమట్టం-590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం -521 అడుగులు
* గ్రామ సచివాలయ రాతపరీక్షల తేదీలు మరోసారి మారేఅవకాశం ఉందని సమాచారం. పలు జిల్లాల కలెక్టర్ల సలహా
మేరకు తేదీల మార్పుపై చర్చిస్తామని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.
పేర్కొన్నారు. పరీక్షల తేదీల మార్పుపై చర్చించి తుదినిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా గ్రామ సచివాలయ పోస్టుల కోసం 19.95లక్షల దరఖాస్తులు రాగా,ఇప్పటివరకు 15.46లక్షల మంది ఓటీపీఆర్ చేసుకున్నారు.
* ప్రకృతి అందాలకు నెలవైన కేరళ రాష్ట్రం.. వరుణుడి ప్రకోపంతో అస్తవ్యస్తంగా మారింది. జలదిగ్బంధం నడుమ జన జీవనం స్తంభించింది. గత ఏడాది ఇదే పరిస్థితిని ఎదుర్కొని.. క్రమేపీ కోలుకుంటున్న దశలో మళ్లీ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి ఆ రాష్ట్రం వణికిపోతోంది. అక్కడక్కడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా ఉప్పొంగుతున్నాయి.
*విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. మరో కొన్ని ఆవులు చావుబతుకుల మధ్య కొట్లాడుతున్నాయి. శుక్రవారం రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆవులు మృతి చెందడంతో వీటికి పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. అనంతరం గోవుల మృతికి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.మరోవైపు గోశాల నిర్వాహకులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా?ఆ కక్షతోనే విరోధులు ఇలాంటి చర్యకు పూనుకొన్నారా? అనే దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో అసౌకర్యంగా ఉండటంతో ఉదయం 10 గంటల సమయంలో ఆయనను దిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు.
*విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై పునఃసమీక్ష నిర్ణయం, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వు చేస్తూ తీసుకొచ్చిన చట్టం రెండూ పెట్టుబడులు, పరిశ్రమల రాకకు అనుకూలమైనవేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
*రాష్ట్రంలో వడ్డీ లేని పంట రుణాల (వీఎల్ఆర్) పథకం అమల్లో ఉన్నా.. బ్యాంకులు రైతుల ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఈ పథకం కింద గత రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని, రైతుల నుంచే వడ్డీ వసూలు చేస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయి.
*ఆరోగ్య పథకం అమలులో ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించడానికి తమ వంతుగా భాగస్వాములమవుతామని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఈ విషయమై గతంలో పలు సందర్భాల్లో వైద్య ఆరోగ్యశాఖకు వినతిపత్రాలు అందజేసిన ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సచివాలయంలో మరోసారి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిసి ఆర్థిక భాగస్వామ్యంపై తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
*తెలంగాణ తాత్కాలిక సచివాలయం బూర్గుల రామకృష్ణారావు(బీఆర్కే) భవన్లో శుక్రవారం నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బీఆర్కే భవన్ నుంచి బాధ్యతలు నిర్వర్తించారు.
*తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న భాజపా సెప్టెంబరు 17న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను ఆహ్వానించగా సుముఖత తెలిపారు.
*ప్రధాన నదులతోపాటు వాగులు, వంకల నుంచి వస్తున్న ప్రవాహాలతో రిజర్వాయర్లలోకి భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నీటి మట్టం 880 అడుగులు దాటడం, ఎగువ నుంచి ప్రవాహం భారీగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు.
* కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న విషయం శనివారం తేలనుంది. సోనియా గాంధీ నివాసంలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్కు ఈ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వ్యాపించాయి.
*భద్రాచలం వద్ద గోదావరి వరద శుక్రవారం 47.9 అడుగులకు చేరింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ శుక్రవారం ఉదయం 8 గంటలకు 47.9 అడుగులకు చేరింది.
*భారీ వర్షాల కారణంగా శంషాబాద్- కొచ్చిన్ల మధ్య ఇండిగో, గో ఎయిర్, ఇతర ఎయిర్లైన్స్ సంస్థలకు చెందిన 10 రోజువారీ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వరదనీరు కొచ్చిన్ విమానాశ్రయంలోకి ప్రవేశించడంతో, రాకపోకలను తాత్కాలికంగా 11వ తేదీ వరకు ఆపాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.
*అవినీతి నిరోధక శాఖ(అనిశా) ఈఎస్ఐ ఔషధాల కుంభకోణం గుట్టు విప్పుతోంది. అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కోరుతూ కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
*రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం పగలు ఎక్కడా భారీ వర్షాలు పడలేదు. మొత్తం 118 ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి. అత్యధికంగా నీల్వాయి, తాండ్ర గ్రామాల్లో 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
*కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.4075.11 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి 144 వాయిదాల్లో పూర్తిగా చెల్లించేలా, వడ్డీ విధివిధానాలపై రుణ ఒప్పంద నిబంధనలకు ఆమోదం తెలిపింది.
*నిమ్స్లో జరిగిన మంచాల కొనుగోళ్లపై విచారణ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగనుంది. ఈ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అనిశా విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
*క్రీడా సంఘాలు కలిసి పనిచేసినప్పుడే పతకాలు వస్తాయని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. క్రీడాకారుల సాధనకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
*న్యాయవాదులుగా అనుభవం లేని 14 మందిని హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ)గా సర్కారు నియమించిందంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
*పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖలో ఏప్రిల్కు ముందు మంజూరై, మొదలుకాని రూ.56.84 కోట్ల విలువైన 144 పనులను రద్దుచేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. గ్రామీణాభివృద్ధి నిధితో పాటు ఉపాధి హామీ నిధుల మ్యాచింగ్ గ్రాంట్తో కలిపి ఆయా జిల్లాల్లో వేర్వేరు పనులు మంజూరు చేశారు. ఏప్రిల్1 వరకు ఈ పనులు ఆరంభించకపోవడంతో వాటిని రద్దుచేస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. వీటిలో అత్యధికంగా విశాఖ జిల్లాలో రూ.19.12 కోట్లు, కృష్ణాలో రూ.10.88 కోట్ల పనులు ఉన్నాయి.
*కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.4075.11 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి 144 వాయిదాల్లో పూర్తిగా చెల్లించేలా, వడ్డీ విధివిధానాలపై రుణ ఒప్పంద నిబంధనలకు ఆమోదం తెలిపింది.
*బక్రీద్ను పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) డైరెక్టర్గా కె.కన్నబాబును ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం ఆర్థిక, గణాంకశాఖ డైరెక్టరేట్లో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
*ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నెల 14 నుంచి ప్రాసెసింగ్ రుసుము చెల్లింపునకు అవకాశం కల్పించారు. 16 నుంచి అర్హత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు.