సినీ నటుడు చిరంజీవి నివాసం ముందు గురువారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను కథామూలంగా తీసుకొని కొణిదెల ప్రొడక్షన్స్లో ‘సైరా నరసింహారెడ్డి’ పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారంటూ పలు దఫాలుగా చిరంజీవి రక్తనిధి కేంద్రం, జూబ్లీహిల్స్లోని కొణిదెల కార్యాలయం వద్ద ఉయ్యాలవాడకు చెందిన కొందరు ఆందోళన చేసిన సంగతి విదితమే. జూన్ 30న సైతం వీరంతా ఆందోళన చేపట్టగా ఆగస్టులో మాట్లాడతామని, సమస్య పరిష్కరిస్తామంటూ కొణిదెల ప్రొడక్షన్స్ ప్రతినిధులు వారికి హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. ఈ క్రమంలో దస్తగిరిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 12 మంది సభ్యులు చిరంజీవి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సాయంత్రం వదిలిపెట్టారు.
చిరంజీవీ మాట నిలబెట్టుకో…
Related tags :