101 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడికి చేసిన గుండె శస్త్రచికిత్స విజయవంతమైనట్లు గుండె శస్త్రచికిత్స నిపుణుడు మురళీహరీష్ తెలిపారు. శనివారం శాంతిరాం వైద్యశాలలో శస్త్ర చికిత్స వివరాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బనగానపల్లికి చెందిన వెంకటస్వామి రెండేళ్ల నుంచి అయోటిక్ వాల్వ్‌స్టెనోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడన్నారు. ఆయనకు ఈ నెల 2వ తేదీన వాల్వు రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స పూర్తి చేశామన్నారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకుని ఆరోగ్యంగా ఉండటంతో శనివారం డిశ్చార్జు చేశామన్నారు. శస్త్రచికిత్స చేయడం విజయవంతం కావడంతో ఆనందంగా ఉందన్నారు. వైద్యులు చెన్నకేశవ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
101 ఏళ్ల కర్నూలు వృద్ధునికి విజయవంతంగా శస్త్రచికిత్స
Related tags :