Politics

మోత్కుపల్లి కేరాఫ్ కమలపుష్పం

Motkupalli Narasimhulu Joins BJP

భాజపాలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలంగాణ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు త్వరలో భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు.హైదరాబాద్‌లోని మోత్కుపల్లి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెళ్లి ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రెండుగంటలపాటు సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీలో చేరేందుకు మోత్కుపల్లి సానుకూలంగా స్పందించారని, దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆయన పార్టీలో చేరుతారని భాజపా నేతలు తెలిపారు. ఈ నెల 18 భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారని, ఆయన సమక్షంలో తెదేపాకు చెందిన ముఖ్యనేతలు భాజపాలో చేరుతారని లక్ష్మణ్‌ వెల్లడించారు.