తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్‌లోని దర్శకుడి ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఇరువురు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ పట్టిన విశ్వనాథ్… ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణకమలం’ లాంటి ఎన్నో అద్భుత కళాఖండాలను తెరకెక్కించారు. దర్శకుడిగా, నటుడిగా వెండితెరపై చెరగని ముద్రవేశారు.
విశ్వనాధ్‌కు కేసీఆర్ పరామర్శ
Related tags :