DailyDose

సగానికి సగం తెగ్గోశారు

సగానికి సగం తెగ్గోశారు-H1b Rejections By USCIS On Record High

హెచ్-1బీ వీసాల మంజూరులో భారతీయ ఐటీ దిగ్గజాలకు చుక్కెదురైంది. ఐటీ సర్వీసుల ఎగుమతుల్లో కీలకంగా ఉన్న దేశీ కంపెనీలకు జారీ చేసే వర్క్ వీసాలు (హెచ్-1బీ) భారీగా తిరస్కరించినట్లు అమెరికాకు చెందిన రీసెర్చ్ ఫౌండేషన్ గణాంకాలు వెల్లడించాయి. వర్క్ వీసాలు ఈ స్థాయిలో తిరస్కరణకు గురవటం కూడా ఇదే మొదటిసారి. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో కంపెనీలు దాఖలు చేసిన వీసా దరఖాస్తులు సగానికి సగం తిరస్కరణకు గురయ్యాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎ్ఫఏపీ) నివేదిక వెల్లడించింది. ఇది ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి అని పేర్కొంది. యూఎస్ సిటిజన్షి్ప అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎ్ససీఐఎస్) 2018-19 (అక్టోబరు-సెప్టెంబరు) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన డేటా ఆధారంగా ఎన్ఎ్ఫఏపీ ఈ నివేదికను రూపొందించింది. ఇన్ఫోసి్సకు సంబంధించి వీసా తిరస్కరణలు 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతంగా ఉండగా 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో ఏకంగా 57 శాతానికి దూసుకుపోయాయని నివేదిక తెలిపింది. హెచ్సీఎల్ టెక్నాలజీ్సకు సంబంధించి వీసాల తిరస్కరణ కూడా 2 శాతం నుంచి 43 శాతానికి పెరగగా విప్రోకు సంబంధించి ఇది 7 శాతం నుంచి 62 శాతానికి పెరిగిందని పేర్కొంది. హెచ్-1బీ వీసాలు ఇంత భారీ స్థాయిలో తిరస్కరణకు గురవటంతో భారతీయ ఐటీ సంస్థలు.. అమెరికాలోని కీలక క్లయింట్లకు సేవలందించే సామర్థ్యంపై ప్రభావం పడిందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ట్రేడ్ డిపార్ట్మెంట్) శివీంద్ర సింగ్ అన్నారు. అంతేకాకుండా యూఎస్ మార్కెట్ వ్యయాలపరంగా మరింత భారంగా మారిందన్నారు. వీసాల తిరస్కరణ కారణంగా యూఎ్సలోని ఫార్చ్యూన్ 500 కంపెనీలకు నాణ్యమైన సేవలందించటంలో ఆటంకాలు ఏర్పడతాయని అమెరికా ప్రభుత్వం దృష్టికి నాస్కామ్ తీసుకెళ్లిందని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపిందని సింగ్ చెప్పారు. అయితే హెచ్-1బీ వీసాల జారీకి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించిందని, ఇందులో భాగంగానే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎ్ఫఈ)ను ఇమ్మిగ్రేషన్ శాఖ జారీ చేసిందన్నారు. తొలుత రుజువులు లేకపోవటంతో వీసాలు తిరస్కరణకు గురయినప్పటికీ ఆ తర్వాత ఆయా కంపెనీలు అందజేసిన రుజువులతో మళ్లీ మంజూరు చేశారని తెలిపారు. ఆర్ఎ్ఫఈలకు సంబంధించిన ప్రక్రియ చాలా ఎక్కువగా ఉండటం కూడా వీసాల మంజూరులో జాప్యం నెలకొంటోందని సింగ్ తెలిపారు.