WorldWonders

ఒక కోడిగుడ్డు ఆమ్లెట్=₹850

One egg omelette charged 850 rupees in India-ఒక కోడిగుడ్డు ఆమ్లెట్=₹850

ఇటీవల రెండు అరటిపండ్లకు చండీగఢ్‌లోని ఓ రెస్టారెంట్‌ వాళ్లు రూ.442 వసూలు చేసిన ఉదంతం మరువక ముందే దానికి మించిన ఘటన మరొకటి చోటుచేసుకుంది. ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్‌లో రెండు ఉడకబెట్టిన గుడ్లకు ఏకంగా రూ.1700 వసూలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ బిల్లు కట్టిన బాధితుడే పంచుకున్నాడు. సాక్ష్యంగా రశీదును సైతం ట్విటర్‌లో షేర్‌ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ‘ఆల్‌ ద క్వీన్స్‌ మెన్‌’ పుస్తక రచయిత కార్తీక్‌ ధర్‌ ఈ నెల 10న ముంబయిలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌కి వెళ్లారు. రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్లతో పాటు మరికొన్ని ఐటెమ్స్‌ ఆర్డర్‌ చేశారు. బిల్లు తెచ్చే సరికి నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. రెండు ఉడకబెట్టిన గుడ్లకు రూ.1700, ఒక ఆమ్లెట్‌కు రూ.850 వేయడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన ఆవేదనను ట్విటర్‌ వేదికగా.. పంచుకున్నారు. పైగా ‘సోదరా నిరసన కార్యక్రమం చేపడదామా’ అంటూ తన తోటి బాధితుడైన రాహుల్‌ బోస్‌ను తన పోస్ట్‌కి ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. గుడ్డులో ఏమైనా బంగారం దొరికిందా?అని అడుగుతూ నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేశారు. దీనిపై ఇప్పటివరు హోటల్‌ యాజమాన్యం మాత్రం స్పందించలేదు.ఇటీవల ప్రముఖ నటుడు ‘దిల్ దడక్‌నే దో’ ఫేమ్ రాహుల్‌ బోస్‌కు చండీగఢ్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వారు రెండు అరటి పండ్లకు రూ.442.50 వసూలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు విచారణ జరిపి అధిక జీఎస్టీ వసూలు చేసినందుకు రూ.25వేల జరిమానా విధించారు. మరి ఈ గుడ్ల ధర విషయంలో ఏం చేస్తారో చూడాలి మరి!