Movies

Rx To RDX

Rx To RDX

తెలుగులో తొలి చిత్రంతోనే కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొట్టింది పాయల్‌ రాజ్‌పుత్‌. ‘ఆర్‌ఎక్స్‌.100’ విడుదలైనప్పట్నుంచి ఆ చిత్రం పేరుతోనే ప్రచారంలో ఉన్న ఈ నాయిక, ఇకపైన ‘ఆర్‌.డి.ఎక్స్‌…’ నాయిక అనిపించుకోబోతోంది. ఇక్కడ చిత్రంలో ఆమె ఇలా హొయలుపోయింది ‘ఆర్‌.డి.ఎక్స్‌.లవ్‌’ చిత్రం కోసమే. పాయల్‌ రాజ్‌పుత్‌, తేజస్‌ కంచర్ల జంటగా నటించిన చిత్రమిది. శంకర్‌ భాను దర్శకుడు. సి.కల్యాణ్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది.నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే వారంలో టీజర్‌ని విడుదల చేస్తారు. ‘‘పాయల్‌ మరోసారి తన అందం, అభినయంతో ఆకట్టుకోబోతోంది. త్వరలోనే విడుదల చేస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి.