బాలీవుడ్ దంపతులు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ తమ దాతృత్వం చాటుకున్నారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. సోమవారం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఫడణవీస్ ట్విటర్ వేదికగా జెనీలియా, రితేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.దీనికి రితేష్ ప్రతిస్పందించారు. ‘వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నా మనసును, జెనీలియా మనసును చలింపజేశాయి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రిని కలసి ‘దేశ్ ఫౌండేషన్’ తరఫున విరాళం అందించాం. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నా. మనమంతా కలిస్తే ఎంతో సాధించొచ్చు. థాంక్స్ దేవేంద్ర ఫడణవీస్ జీ’ అని ఆయన ట్వీట్లు చేశారు.
₹25లక్షల విరాళం
Related tags :